ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> South hero who bought costly house in Mumbai

ముంబై లో కాస్ట్లీ ఇల్లు కొన్న సౌత్ హీరో

South hero who bought costly house in Mumbai

కోలీవుడ్ హీరో సూర్య ఇప్పుడు ముంబై లోనే మకాం పెట్టారు. ఆయన తన భార్య జ్యోతిక ఇద్దరు పిల్లతో కలిసి కొద్దిరోజులుగా ముంబైలోనే ఉంటున్నారు. ఆయన తండ్రి తో వచ్చిన విభేదాల కారణంగానే సూర్య చెన్నై తండ్రి-తమ్ముడు కుటుంబం నుండి వేరుగా ముంబై వెళ్లిపోయారనే న్యూస్ మొన్నామధ్యన కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొట్టింది. అందులోను సూర్య హిందీలో సూరారై పోట్రునిరీమేక్ చేస్తున్నారు. అందుకోసమే ఆయన ముంబైలో ఉంటున్నారు అనే వారూ ఉన్నారు.

అయితే సూర్య ఇప్పుడు చెన్నై నుండి ముంబై కి పూర్తిగా షిఫ్ట్ అవ్వబోతున్నారనేలా అక్కడ ముంబై లోని కాస్ట్లీ ఏరియాలో ఓ ఇల్లు కొనేశారంటూ వార్తలొస్తున్నాయి. ముంబై లోని కాస్ట్లీ ఏరియా లో సెలబ్రిటీస్, పొలిటిషన్స్ ఉండే ఏరియాలో 70 కోట్లతో ల‌గ్జ‌రీ ఇల్లు కొన్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. కొన్నాళ్లుగా ముంబై లో రెంట్ కే ఉంటున్న సూర్య ఇప్పుడు కొత్త ఇల్లు కొనేశారని, త్వరలోనే ఆ ప్లాట్ కి సూర్య -జ్యోతిక పిల్లలతో కలిసి షిఫ్ట్ అవుతారని తెలుస్తుంది.

ప్రసతుతం హీరోగానే కాకుండా నిర్మాతగానూ సూర్య సినిమాలు నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ నిర్మాతగా మారారు. అటు జ్యోతిక కూడా తనకి సరిపోయే నచ్చిన కథలతో సినిమాల్లో నటిస్తుంది.

Suriya purchased costly house in Mumbai

suriya
mumbai