Advertisement

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోపై క్రేజీ న్యూస్

Mon 20th Mar 2023 10:38 AM
ntr,prashanth neel,ntr31  ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోపై క్రేజీ న్యూస్
Crazy news on NTR31 ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోపై క్రేజీ న్యూస్
Advertisement

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా NTR30 మరో మూడు రోజుల్లో మొదలుకాబోతుంది. ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తో విపరీతమైన అంచనాలతో ఎన్టీఆర్ దర్శకుడు కొరటాలతో కలిసి పాన్ ఇండియా మూవీ కి శ్రీకారం చుట్టేస్తున్నారు. 23 న NTR30 పూజా కార్యక్రమాలతో మొదలై 29 నుండి రెగ్యులర్ షూట్ కి వెళ్లబోతుంది అని తెలుస్తుంది. అస్సలు గ్యాప్ లేకుండా ఎన్టీఆర్ సినిమా చిత్రకరణలో పాల్గొంటారని.. హీరోయిన్ జాన్వీ కపూర్ డేట్స్ కూడా గుత్తంగా బుక్ చేసారని తెలుస్తుంది.

ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో NTR31 చెయ్యాలి. ఈ చిత్రంపై ఇప్పుడొక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది ప్రభాస్ తో చేసే  సలార్ ని సెప్టెంబర్ లో రిలీజ్ చేసేసి.. తరవాత ఒకటి రెండు నెలలు ఆ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేసేసి.. ప్రశాంత్ నీల్ NTR31 స్క్రిప్ట్ పై కూర్చుంటారట. అయితే అటు ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ తో ఇంటర్నేషనల్ రేంజ్ లో హైలెట్ అవడంతో.. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని గ్లోబల్ స్టార్ గా పరిచయం చెయ్యాలని అనుకుంటున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అందుకే ప్రశాంత్ నీల్ ముందుగానే ఎన్టీఆర్ తో చెయ్యబోయే చిత్రం పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీగా ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. భారీ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయనున్నారట. అంతేకాకుండా నటీనటులని కూడా హాలీవుడ్ నుండే తీసుకు రావాలని చూస్తున్నారట. మరి ఈ వార్తలో ఎంత నిజముందో కానీ.. ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తూ ఆ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నారు.

Crazy news on NTR31:

Interesting news on NTR-Prashanth Neel combo

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement