Advertisement

నందమూరి సపోర్ట్ ఎంత హెల్ప్ అవ్వుద్ది

Sat 18th Mar 2023 07:31 PM
nandamuri heroes,vishwak sen  నందమూరి సపోర్ట్ ఎంత హెల్ప్ అవ్వుద్ది
How Nandamuri support helps? నందమూరి సపోర్ట్ ఎంత హెల్ప్ అవ్వుద్ది
Advertisement

యంగ్ హీరో విశ్వక్ సేన్ నందమూరి హీరోలని నమ్ముకుని బాక్సాఫీసు బరిలోకి దిగబోతున్నాడు. తెలుగు లోనే కాదు పాన్ ఇండియా రేంజ్ లో విశ్వక్ సేన్ ధమ్కీ మూవీని రిలీజ్ చేస్తున్నాడు. ఈనెల 22 ఉగాది స్పెషల్ గా విడుదల కాబోతున్న ధమ్కీ లో నందమూరి హీరోల క్రేజ్ ఎంత హెల్ప్ అవుతుందో.. ఏ రేంజ్ ఓపెనింగ్స్ తెస్తాయో చూడాలి. ఎందుకంటే ధమ్కీ చిత్ర మొదటి ట్రైలర్ ని బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చేసి నందమూరి అభిమానులని తనవైపు తిప్పేసుకున్నాడు.

ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మరో నందమూరి హీరో ఎన్టీఆర్ ని తెచ్చేసాడు. అందులోను ఆస్కార్ కొల్లగొట్టిన ఆర్.ఆర్.ఆర్ హీరో కావడం ధమ్కీ పై అంచనాలు పెంచేందుకు మరింత అదనపు ఆకర్షణ. ఎన్టీఆర్ వచ్చాడు ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసాడు. విశ్వక్ సేన్ నటించిన సినిమాలను వరసబెట్టి గుక్కతిప్పుకోకుండా చెప్పేసాడు. మరి ఎన్టీఆర్ విశ్వక్ సేన్ సినిమాలను చూసి మరీ రివ్యూస్ ఇచ్చాడు. ఇక విశ్వక్ తన డబ్బు మొత్తం పెట్టేసి ధమ్కీ చేసాడు అని ఎన్టీఆర్ రివీల్ చేసాడు.

అటు బాలకృష్ణ క్రేజ్, ఇటు ఎన్టీఆర్ క్రేజ్ ధమ్కీ ఓపెనింగ్స్ కి హెల్ప్ అయితే విశ్వక్ కి సూపర్. నందమూరి హీరోలిద్దరూ విశ్వక్ సేన్ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. విశ్వక్ కి ఈ నందమూరి సపోర్ట్ ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.

How Nandamuri support helps?:

Nandamuri Heroes for Vishwak Sen

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement