Advertisementt

డిస్పాయింట్ అవుతున్న మహేష్ ఫాన్స్

Sun 12th Mar 2023 09:44 PM
mahesh babu  డిస్పాయింట్ అవుతున్న మహేష్ ఫాన్స్
Disappointed Mahesh Fans డిస్పాయింట్ అవుతున్న మహేష్ ఫాన్స్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు పెద్దగా లుక్స్ విషయంలో ఎలాంటి కొత్తరకమైన ప్రయోగాలు చెయ్యడు. కొత్తగా ట్రై చెయ్యడు, రిస్క్ తీసుకోడు. గతంలో సుకుమార్ 1 నేనొక్కడినే కోసం మహేష్ బాబు సిక్స్ ప్యాక్ లుక్ ట్రై చేసినప్పుడు ఫేస్ లో గ్లో పోయి.. మహేష్ మొహం కొత్తగా కనిపించింది. మహేష్ కి సిక్స్ ప్యాక్ బాడీ ఎలా ఉన్న మోహంలో కళ కోల్పోవడం అప్పట్లో మహేష్ అభిమానులని కలవరపరిచింది. ఆ తర్వాత మహేష్ ఎప్పుడు అందంగానే, ఆకర్షణగానే కనిపించేవాడు.

కానీ ఇప్పుడు మహేష్ మొహంలో మళ్ళీ ఏదో తెలియని తేడా కనిపిస్తుంది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ బాడీ ని ఫిట్ గా ఉంచుతున్న మహేష్ బాబు మొహంలో మళ్ళీ కళ మిస్ అయినట్లుగా అభిమానులు ఫీలవుతున్నారు. అది లాంగ్ హెయిర్ వలన అలా కనిపిస్తున్నాడా.. లేదంటే వేరేగా ఎమన్నా ట్రై చేశాడా అనే ఆలోచనలో మహేష్ ఫాన్స్ ఉన్నారు. రీసెంట్ గా ఆయన నమ్రత-ఏసియన్ సునీల్ వాళ్లతో కలిసి రెస్టారెంట్ లో కనిపించారు. అలాగే నిన్న ఫ్యామిలీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్లారు.

ఈ రెండు లుక్స్ చూసిన మహేష్ ఫాన్స్ మళ్ళీ ఏదో కొడుతోంది మహేషా.. మొహం పొడవుగా మారిపోయింది అంటూ ఆందోళన పడుతున్నారు. సర్కారు వారి పాటలో చక్కగా ఉన్న మహేష్ ఇలా ఎందుకయ్యాడో అనే దీర్ఘాలు మొదలు పెట్టారు. మరి త్రివిక్రమ్ తో SSMB28 కోసం మహేష్ ఎమన్నా కొత్తగా ట్రై చేస్తున్నాడా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఏది ఏమైనా మహేష్ లుక్ విషయంలో ఫాన్స్ మాత్రం కాస్త డిస్పాయింట్ అవుతూ కనిపిస్తున్నారు.

Disappointed Mahesh Fans:

Disappointment On Mahesh Babu New Looks

Tags:   MAHESH BABU
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ