Advertisementt

యంగ్ హీరో మూవీపై బజ్ కనిపించడంలేదు

Sun 12th Mar 2023 11:41 AM
naga shaurya,phalana abbayi-phalana ammayi  యంగ్ హీరో మూవీపై బజ్ కనిపించడంలేదు
There is no buzz on the young hero movie యంగ్ హీరో మూవీపై బజ్ కనిపించడంలేదు
Advertisement
Ads by CJ

కృష్ణ వ్రింద విహారితో సో సో హిట్ అందుకున్న నాగ శౌర్య తదుపరి మూవీ ని శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి సినిమా చేసాడు. వచ్చే వారమే రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ చిత్రంపై ట్రేడ్ లో కానీ, ప్రేక్షకుల్లోకాని పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. అసలు ఈ చిత్రంపై సోషల్ మీడియాలోనూ ఎలాంటి బజ్ క్రియేట్ కావడమే లేదు. కొద్ది రోజులుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగ శౌర్యకి ఈ చిత్రం హిట్ కంపల్సరీ అనేలా ఉంది.

గతంలో మాళవిక నాయర్ తో నాగ శౌర్య కల్యాణ వైభోగమే చిత్రం చేసాడు. ఇప్పుడు మళ్ళీ అదే హీరోయిన్ తో ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి చేసాడు. అటు చూస్తే మాళవిక నాయర్ ఫామ్ లోనే లేదు. ఇటు నాగ శౌర్య కి ప్రస్తుతం పెద్దగా సక్సెస్ లేకపోవడమే ఈ చిత్రంపై బజ్ క్రియేట్ కాకపోవడానికి కారణమనిపించేలా ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఇంట్రెస్ట్ కలిగించేదిలా ఉంది.

మరి ఈ నాలుగు రోజులపాటు సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లి ప్రమోషన్స్ చేస్తే బజ్ క్రియేట్ అవుతుంది. లేదంటే కష్టం. మరి మేకర్స్ కూడా ఈ 4 డేస్ డిఫరెంట్ ప్రమోషన్స్ గనక ప్లాన్ చేస్తే.. సోలో గా రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమా గట్టెక్కేస్తుంది. లేదంటే ఇప్పుడున్న పరిస్తితుల్లో సినిమాకి కలెక్షన్స్ రావాలంటే చాలా కష్టం.

There is no buzz on the young hero movie:

Phalana Abbayi-Phalana Ammayi without buzz

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ