Advertisementt

కంట్రోల్.. కంట్రోల్ అంటున్న ఎన్టీఆర్ ఫాన్స్

Thu 09th Mar 2023 11:58 AM
ntr fans,janhvi kapoor  కంట్రోల్.. కంట్రోల్ అంటున్న ఎన్టీఆర్ ఫాన్స్
NTR fans request to Janhvi Kapoor కంట్రోల్.. కంట్రోల్ అంటున్న ఎన్టీఆర్ ఫాన్స్
Advertisement
Ads by CJ

జాన్వీ కపూర్ గత ఐదేళ్లుగా బాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి చెయ్యని ప్రయత్నం లేదు. వరసగా సినిమాలు చేస్తుంది కానీ.. ఆమెకు సక్సెస్ రావడమే లేదు. రీమేక్స్ ని నమ్ముకుని ఆడియన్స్ ముందుకు వస్తుంటే వారు జాన్వీ సినిమాలని లైట్ తీసుకుంటున్నారు. ముందు బాలీవుడ్ లో టాప్ పొజిషన్ కి వెళ్లాకే సౌత్ కి ఎంట్రీ ఇవ్వొచ్చనే ఉద్దేశ్యంతో జాన్వీ సౌత్ అవకాశాలను వదులుకుంది. అయితే సినిమాల విషయం పక్కనబెడితే.. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాలు ఆరబోసే విషయంలో అందరి కన్నా అంటే గ్లామర్ హీరోయిన్స్ కన్నా సీనియర్ లా ప్రవర్తిస్తూ ఉంటుంది.

ఊరికూరికే అందాలు ఆరబోసెయ్యడం, జిమ్ డ్రెస్సులతో యూత్ లో హీట్ పుట్టించడం, అవసరం ఉన్నా, లేకున్నా గ్లామర్ షో చెయ్యడం అన్నమాట. ఇక సినిమాల్లో పద్దతిగల పాత్రల్లో కనిపించే జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో మాత్రం చూపించాల్సింది చూపించేస్తూ బోర్ కొట్టించేస్తుంది. పదే పదే ఆమె చేసే గ్లామర్ షో మొహం మొత్తేలా తయారైంది. ఇప్పుడు యంగ్ టైగర్ సరసన పాన్ ఇండియా లెవల్లో సౌత్ కి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ తగిలింది.

ఇప్పటినుండి అయినా పద్దతిగా బయట ఎక్కువగా గ్లామర్ షో చెయ్యకు తల్లి.. కాస్త కంట్రోల్ గా కనిపించు అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ జాన్వీని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించినా సోషల్ మీడియాలో మాత్రం జర జాగ్రత్త.. అవసరం ఉన్నా లేకున్నా హాట్ షో చెయ్యొద్దు అంటూ జాన్వికి ఎన్టీఆర్ ఫాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మా అన్న సినిమాలో మాకు ఫ్రెష్ అందాలు చూపించు అంటూ ఆమెని కోరుకుంటున్నారు.

NTR fans request to Janhvi Kapoor:

NTR fans want to be careful of Janhvi Kapoor

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ