Advertisementt

సుడిగాలి సుధీర్ ఇకపై జబర్దస్త్ లో కనిపించడా?

Wed 01st Mar 2023 09:59 PM
sudigali sudheer,jabardasth  సుడిగాలి సుధీర్ ఇకపై జబర్దస్త్ లో కనిపించడా?
Sudigaali Sudheer is back on Jabardasth again? సుడిగాలి సుధీర్ ఇకపై జబర్దస్త్ లో కనిపించడా?
Advertisement
Ads by CJ

జబర్దస్త్ నుండి ఎక్స్ట్రా జబర్దస్త్ షిఫ్ట్ అయ్యి టీమ్ లీడర్ గా తన ఫ్రెండ్స్ తో కలిసి కామెడీ స్కిట్స్ చేసే సుడిగాలి సుధీర్ కామెడీ కన్నా ఎక్కువగా హైలెట్ అయ్యింది మాత్రం యాంకర్ రేష్మి తో ఉన్న ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వలనే. సుధీర్ కి జబర్దస్త్ లోనే సుడిగాలి అనే టాగ్ తగిలించారు. సుడిగాలి సుధీర్ టీమ్ కి ఓ క్రేజ్ ఉంది. అలాగే మధ్యలో సుధీర్ కొద్దిగా జబర్డస్త్ కి బ్రేక్ తీసుకున్న మళ్ళీ వెంటనే వచ్చేసేవాడు. కానీ ఈసారి జబర్దస్త్ ని వదిలి వేరే ఛానల్ కి వెళ్లడంతో ఆయన అభిమానులు హార్ట్ అయ్యారు. వరస సినిమా షూటింగ్స్ చేసినా జబర్దస్త్ ని వదలని సుధీర్ వేరే ఛానల్ కి మారడంతో మల్లెమాలవాళ్ళు కూడా లైట్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. వారు ముందు ఆరు నెలలు అని ఒప్పుకున్నా ఇప్పుడు ఆయన రీ ఎంట్రీకి అంతగా సుముఖంగా లేరట.

ప్రస్తుతం జబర్దస్త్ లో ఉన్న కమెడియన్స్ కూడా స్కిట్స్ తో అంతగా ఆకట్టుకోవడం లేదు. జబర్దస్త్ కి ఉన్న క్రేజ్, పాపులారిటీ తగ్గుతూ వస్తుంది. సో ఇలాంటి సమయంలో సుధీర్ ని పిలిపించి పారితోషకాలు ఎక్కువ ఇవ్వడం అనవసరమనే అనే భావనలో యాజమాన్యం ఉండగా.. సుధీర్ మాత్రం రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు సుధీర్ చేతిలో సినిమాలు తప్ప అటు జబర్దస్త్, ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీ, మరో ఛానల్ లో సుధీర్ యాంకరింగ్ చెయ్యడానికి షోస్ కూడా లేవు. 

సో సుధీర్ జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నా.. ఆయనకి రీ ఎంట్రీ మీద ఇంట్రెస్ట్ ఉన్నా.. సుధీర్ కి ఛాన్స్ మాత్రం మల్లెమాల యాజమాన్యం ఇవ్వడం లేదు, లేదంటే ఈపాటికి సుధీర్ జబర్దస్త్ స్టేజ్ పై కనిపించేవాడంటూ జబర్దస్త్ కమెడియన్స్ గుసగుసలాడుకుంటున్నారు.

Sudigaali Sudheer is back on Jabardasth again?:

Sudigali Sudheer No Entry in Jabardasth

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ