షాకింగ్ లుక్ లో సుధీర్ బాబు

Wed 01st Mar 2023 10:46 AM
mama mascheendra,sudheer babu  షాకింగ్ లుక్ లో సుధీర్ బాబు
Mama Mascheendra: Sudheer Babu mesmerizes షాకింగ్ లుక్ లో సుధీర్ బాబు
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ కృష్ణ గారి చిన్నల్లుడు, మహేష్ బాబు బావ, హీరో సుధీర్ బాబు సినిమాల్లో స్టార్ స్టేటస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా వుండే సుధీర్ బాబు బాలీవుడ్ లో విలన్ అవతారమెత్తి శెభాష్ అనిపించుకున్నా.. మళ్ళీ తెలుగు సినిమాల్లోనే నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన ఎప్పుడూ మంచి ఫిజిక్ ని మెయింటింగ్  చేస్తూ.. జిమ్ లో వర్కౌట్స్ తో హ్యాండ్ సమ్ గా కనిపిస్తారు. ఎక్కువగా సిక్స్ ప్యాక్ బాడీని చూపించే సుధీర్ బాబు రీసెంట్ గా హంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

ఇప్పుడు తదుపరి ప్రాజెక్ట్ కోసం సుధీర్ బాబు షాకింగ్ లుక్ లోకి మారిపోయారు. దుర్గ అనే బరువైన పాత్రలో మీ దిల్ దోచేయడానికి వస్తున్నాడు! ❤️అంటూ సుధీర్ బాబు లావుగా, బాగా బరువుగా ఉన్న ఫస్ట్ లుక్ ని మామ మశ్చీంద్ర నుండి రివీల్ చేసారు మేకర్స్. రెండు రోజల క్రితం సుధీర్ బాబు ఈ భారీ లుక్ లీకై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏంటి సుధీర్ బాబు ఇంత లావుగా మారిపోయాడన్నారు. ఆ పిక్స్ లో ఆయన ఫేస్ చూస్తే గుమ్మడికాయలా ఉబ్బిపోయింది. 

పొడవాటి జుట్టు , గడ్డంతో సుధీర్ బాబు ఇక్కడ కొంచెం లావు గా కనిపిస్తున్నాడు. ఈ పాత్ర ఊబకాయంతో ఉండే వ్యక్తి గా ఉండబోతుంది అని తెలుస్తుంది. కారు బానెట్ పై కూర్చున్న సుధీర్ బాబు బంగారు గొలుసు వాచ్, ట్రెండీ అవుట్ ఫిట్ ధరించి విలనీ స్మైల్ తో కనిపించాడు. నైట్రో స్టార్ మేక్ఓవర్ ఆశ్చర్యం కలిగించే లాగా ఉంది. సుధీర్ బాబు ఎప్పుడూ విభిన్నమైన పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తాడు.ఈ పాత్ర పూర్తిగా విలక్షణమైనదిగా కనిపిస్తుంది.

సుధీర్ బాబు ని ఇలా చూస్తే ఫాన్స్ షాకవ్వాల్సిందే. అంతలాంటి మేకోవర్ తో కొత్తగా కాదు భారీగా కనిపించి మామ మశ్చీంద్ర అంటూ సుధీర్ బాబు ఒక విధంగా ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు.

Mama Mascheendra: Sudheer Babu mesmerizes:

Mama Mascheendra: Sudheer Babu attracts as Durga

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ