Advertisement

యువకుడికి నాగ శౌర్య వార్నింగ్

Tue 28th Feb 2023 06:39 PM
naga shaurya  యువకుడికి నాగ శౌర్య వార్నింగ్
Naga Shaurya forces a youngster to apologize యువకుడికి నాగ శౌర్య వార్నింగ్
Advertisement

నాగ శౌర్య ప్రస్తుతం ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా మారబోతున్నాడు. మాళవిక నాయర్ తో కలిసి ఈ చిత్రం చేసిన నాగ శౌర్య గత ఏడాది నవంబర్ లో కర్ణాటకకు చెందిన అనూషని పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన వారం రోజుల్లోనే షూటింగ్ లోకి దిగిపోయిన నాగ శౌర్య ఇప్పుడు నడి రోడ్డు మీద ఓ యువకుడితో గొడవపడి ఆ యువకుడికి వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

నాగ శౌర్య కారులో వెళుతున్న సమయంలో రోడ్డు మీద ఓ ప్రేమికుల జంట గొడవపడుతూ ఉండగా.. లవర్ అమ్మాయి మీద చేయి చేసుకోవడం చూసిన నాగ శౌర్య వెంటనే కారు ఆపి ఆ యవకుడి దగ్గరకి వెళ్లి.. ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావ్ అంటూ నిలదీసాడు. అంతేకాకుండా నడి రోడ్డుపై ఆ అమ్మాయిపై చేయి చేసుకుంటావా, ముందు సారి చెప్పు ఆ అమ్మాయికి అంటూ నాగ శౌర్య ఆ యువకుడితో చెప్పినప్పటికీ.. అయినా వినకుండా నా లవర్ నా ఇష్టం అంటూ ఎక్కువ చెయ్యడంతో నాగ శౌర్యకి విపరీతంగా కోపం వచ్చింది.

దానితో ఆ యువకుడిని నాగ శౌర్య నీ లవర్ అయితే రోడ్డు మీద చేయి చేసుకుంటావా అంటూ అతన్ని వార్న్ చెయ్యడం చూసిన వారంతా నాగ శౌర్య చేసిన పనిని మెచ్చుకుంటూ స్పందిస్తుండగా.. నాగ శౌర్య ఆ యువకుడికి వార్నింగ్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Naga Shaurya forces a youngster to apologize:

Why did Naga Shourya turn furious

Tags:   NAGA SHAURYA
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement