బాయ్ ఫ్రెండ్ బర్త్ డే: పాయల్ టాప్ లెస్ ఫోజ్

Boyfriend Birthday: Payal CelebrationBoyfriend Birthday: Payal Celebration

కార్తికేయ తో RX100 సినిమాతో బోల్డ్ బ్యూటీగా టాలీవుడ్ కి పరిచయమైన పాయల్ రాజ్ ఫుట్ కి మళ్ళీ ఆ స్థాయిలో పేరొచ్చిన సినిమా ఒక్కటీ లేదు. కానీ అడపాదప సినిమాలు చేస్తున్న పాయల్ రాజ్ ఫుట్ వెబ్ సీరీస్ లు కూడా చేస్తుంది. గ్లామర్ డాల్ లా, బోల్డ్ బ్యూటీగా మారిన పాయల్ కి ఆశించిన అవకాశాలు రాకపోగా.. ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు ఆమెని లైట్ తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ హడావిడి చేసే పాయల్ రాజ్ ఫుట్ ఓ బాయ్ ఫ్రెండ్ ని కూడా మెయింటింగ్ చేస్తుంది.

సౌర‌భ్‌ దింగ్రా తో ప్రేమలో ఉన్న పాయల్ రాజ్ ఫుట్ అప్పుడప్పుడు అతనితో కలిసున్న పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. అవి మాములుగా ఉన్న ఫొటోస్. కానీ ఇప్పుడు సౌర‌భ్‌ దింగ్రా తో పాయల్ ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. కారణం పాయల్ బాయ్ ఫ్రెండ్ సౌర‌భ్‌ దింగ్రా తో కలిసి టాప్ లెస్ గా ఉన్న ఫొటోస్ ని షేర్ చెయ్యడమే. ప్రియుడు సౌర‌భ్‌ దింగ్రా పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసిన పాయల్ రాజ్ ఫుట్ సౌర‌భ్‌ దింగ్రాతో కలిసి రెచ్చిపోయి ఫొటోలకి ఫోజులిచ్చింది. 

ఆమె చేసిన బర్త్ డే పార్టీ ఏమో కానీ.. పాయల్ టాప్ లెస్ గా ఇచ్చిన ఫోజులు ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో నెటిజెన్స్ ఒకింత షాకవుతున్నారు. ఏంటి పాయల్ మరీ ఇంతిలా బట్టు విప్పేసి బర్త్ డే సెలెబ్రేషన్స్ ఏమిటీ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Payal celebrates her BF birthday

payal rajput