ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kerala HC series on Malayalam actor Unni Mukundan

సమస్యల్లో యశోద హీరో

Kerala HC series on Malayalam actor Unni MukundanKerala HC series on Malayalam actor Unni Mukundan

ఈమధ్యన యశోద సినిమాలో ఆడియన్స్ నుండి మంచి మార్కులు వేయించుకుని.. ఆ సినిమాలో సమంత-వరలక్ష్మి శరత్ కుమార్ తో కలిసి నటించిన ఉన్ని ముకుందన్ ఇప్పుడు సమస్యల్లో ఇరుక్కున్నాడు. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ పై 2018 లో ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టగా.. ఆకేసులో ఉన్ని ముకుందన్ కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు ఉన్ని ముకుందన్ కి కేరళ కోర్టు షాకిచ్చింది. ఆ కేసులో ఉన్ని ముకుందన్ స్టే రద్దు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చెయ్యడంతో ఉన్ని ముకుందన్ చిక్కుల్లో పడ్డాడు.

2018 లో ఉన్ని ముకుందన్ పై యువతి కేసు పెట్టగా.. దానికి  ఉన్నిముకుందన్ లాయర్ జిమ్మిక్కులు చేసి ఆ యువతి కోర్టు బయట సెటిల్మెంట్ చేసుకునేందుకు సంతకం చేసినట్టుగా పత్రాలు సృష్టించి కోర్టుకి సబ్మిట్ చెయ్యడంతో కోర్టు ఆ యువతి ఫిర్యాదు కొట్టిపారేసింది. అప్పుడే ఉన్ని ముకుందన్ కి కోర్టు స్టే ఇచ్చింది. కానీ బాధిత యువతి తాను ఏ పత్రాలపై సంతకం చెయ్యలేదని కోర్టుకి విన్నవించుకోవడంతో.. ఇమ్మిడియట్ గా ఉన్ని ముకుందన్ స్టే విత్ డ్రా చేసుకుంది కోర్టు. అంతేకాకుండా తప్పుడు పత్రాలు చూపించినందుకు ఉన్ని ముకుందన్ లాయర్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇంకా ఉన్నిముకుందన్ ఈ కేసులో అఫిడవిడ్ దాఖలు చెయ్యాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణని ఈ నెల 17 కి వాయిదా వేసింది కేరళ కోర్టు.

Kerala HC lifts stay on sexual harassment trial against Malayalam actor Unni Mukundan

kerala hc
unni mukundan