Advertisementt

విదేశాలకు తారకరత్న తరలింపు?

Fri 03rd Feb 2023 09:14 PM
taraka ratna health update  విదేశాలకు తారకరత్న తరలింపు?
Tarakaratna is to be airdashed for better treatment విదేశాలకు తారకరత్న తరలింపు?
Advertisement
Ads by CJ

నందమూరి తారకరత్న గత శుక్రవారం అంటే జనవరి 27వ తేదీన లోకేశ్​ యువగళం పాదయాత్రలో పాల్గొని తీవ్రమైన హార్ట్ స్ట్రోక్ కి గురైన విషయం తెలిసిందే. ఆరోజు కుప్పం ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు ప్రత్యేక వైద్య బృందంతో చికిత్సను అందిస్తూనే ఉన్నారు. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో గత ఏడు రోజులుగా తారకరత్నకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మధ్యలో తారకరత్న చికిత్సకి స్పందిస్తున్నారని అన్నప్పటికీ..  నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. 

నందమూరి బాలకృష్ణ తన అన్న కొడుకు తారకరత్న వద్దే ఉంటూ నిత్యం డాక్టర్లకు అందుబాటులో ఉంటూ తారకరత్నకు అందిస్తున్న చికిత్సకి సంబందించిన అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రీసెంట్ గా తారకరత్న మెదడుకు శస్త్రచికిత్స చేశారు. స్కాన్ రిపోర్టర్ వచ్చిన తర్వాత డాక్టర్‌ల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు.

తారకరత్నకు సంబందించిన స్కాన్ రిపోర్టర్ వచ్చిన తర్వాత డాక్టర్‌ల సలహాతో తారకరత్న కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం ఆయనను విదేశాలకు తీసుకెళ్లనున్నారు అని తెలుస్తుంది.

Tarakaratna is to be airdashed for better treatment:

>Taraka Ratna health update

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ