Advertisement

ఉన్నట్టుండి జవాన్ పై పెరిగిన క్రేజ్

Mon 30th Jan 2023 12:14 PM
shah rukh khan,atlee jawan  ఉన్నట్టుండి జవాన్ పై పెరిగిన క్రేజ్
Shah Rukh Khan Fans Wait For Atlee Jawan ఉన్నట్టుండి జవాన్ పై పెరిగిన క్రేజ్
Advertisement

ఐదేళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ పఠాన్ తో ప్రభంజనం సృష్టించారు. కొద్దిరోజులుగా కెరీర్ లోను, పర్సనల్ లైఫ్ లోను సఫర్ అవుతున్న షారుఖ్ పఠాన్ సక్సెస్ బిగ్ రిలీఫ్ నిచ్చింది. రోజుకి 100 కోట్ల లెక్కన అయిదు రోజులకు 500 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి బాలీవుడ్ కి ఊపిరిపోసింది. పఠాన్ తో షారుక్ కెరీర్ మళ్ళీ ప్రాణం పోసుకుంది. అలాగే హిందీ మర్కెట్ కూడా పఠాన్ కలెక్షన్స్ తో రెపరెపలాడుతుంది. షారుఖ్ పఠాన్ విజయంతో ఆయన తదుపరి ప్రాజెక్ట్ పై భీభత్సమైన క్రేజ్ పెరిగిపోయింది.

తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ చేస్తున్నాడు. నయనతార హీరోయిన్ కావడం, షారుఖ్ జవాన్ ఫస్ట్ లుక్ తో ఇంప్రెస్స్ చెయ్యడంతో మామూలుగానే జవాన్ పై అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు షారుఖ్ పఠాన్ విజయంతో జవాన్ పై అంచనాలు, హైప్ మరింతగా పెరగడమే కాదు, జవాన్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడినట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి.

ఒక్క విజయంతో షారుఖ్ మళ్ళీ పూర్వ వైభవాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విజయ్ ఇచ్చిన బూస్ట్ తో ఆయన తదుపరి ప్రాజెక్ట్ లపై పెరుగుతున్న అంచనాలతో షారుఖ్ ఫుల్ ఖుషీగా ఉన్నట్లుగా తెలుస్తుంది.

Shah Rukh Khan Fans Wait For Atlee Jawan:

Amid Pathaan Craze, Shah Rukh Khan Fans Wait For Atlee Jawan

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement