Advertisementt

హంట్ ట్విట్టర్ రివ్యూ

Thu 26th Jan 2023 10:35 AM
hunt twitter review  హంట్ ట్విట్టర్ రివ్యూ
Hunt Twitter Review హంట్ ట్విట్టర్ రివ్యూ
Advertisement
Ads by CJ

సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ హంట్ ఈ రోజు గురువారం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్, టీజర్ తో ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించిన హంట్ మూవీ ఎలా ఉందో.. ఓవర్సీస్ ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ లో ఉంచుతున్నారు. ఇప్పటివరకు ఆడియన్స్ ఇస్తున్న అభిప్రాయాలు చూస్తుంటే హంట్ మూవీపై మిక్స్డ్ టాక్ వినబడుతుంది. హంట్ ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల పరిచయానికి సమయం తీసుకుని.. కథలోకి వెళ్ళడానికి చాలా టైమ్ తీసుకున్నాడని అంటున్నారు. కానీ హంట్ ఇంటర్వెల్ మాత్రం ఆసక్తికరంగా ఉంది అంటున్నారు. సెకెండాఫ్‌లో మాత్రం కాస్త ఎంగేజింగ్‌గా ఉందని, క్లైమాక్స్ ఓ ట్విస్టుతో కూడి ఉంటుందని అంటున్నారు.

ఫస్ట్ హాఫ్ లో ఏం లేదని తేల్చేసిన ప్రేక్షకులు కథ, సినిమాలోని అక్కడక్కడా ట్విస్టులు, సెకెండాఫ్, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్ అంటుంటే.. సినిమా చాలా స్లోగా సాగడం, ఫస్టాఫ్, కమర్షియల్ హంగులు లేకపోవడం, విజువల్స్ అన్ని హంట్ చిత్రానికి మైనస్‌గా మారాయని, సుధీర్ బాబు పెరఫార్మెన్స్ బావుంది అంటూ నెటిజెన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఓవరాల్ గా హంట్ కి ఆడియన్స్ నుండి మిక్స్డ్ టాక్ అయితే గట్టిగా వినబడుతుంది. 

Hunt Twitter Review:

Hunt Audience Review

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ