Advertisementt

చాలా హోప్స్ పెట్టుకున్నాడు కానీ..

Wed 25th Jan 2023 09:54 PM
sudheer babu,hunt movie  చాలా హోప్స్ పెట్టుకున్నాడు కానీ..
Hunt releasing tomorrow చాలా హోప్స్ పెట్టుకున్నాడు కానీ..
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ కృష్ణగారి చిన్నల్లుడు సుధీర్ బాబు కొంతకాలంగా సక్సెస్ కోసం ఫైట్ చేస్తున్నాడు. సమ్మోహనంతో మంచి సినిమా ఇచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణతో వరసగా సినిమాలు చేసిన సుధీర్ బాబుకి ఇంద్రగంటి V తో షాకిచ్చాడు. ఆ సినిమా అంతో ఇంతో బావుంది అంటే దాని క్రెడిట్ మొత్తం మరో హీరో నాని ఖాతాలో వేసుకున్నాడు. ఇక తర్వాత అదే డైరెక్టర్ తో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటూ వచ్చి డిసాస్టర్ కొట్టిన సుధీర్ బాబుకి ఇమ్మిడియట్ గా ఓ హిట్ అవసరం పడింది.

ప్రస్తుతం హంట్ మూవీతో రేపు రిపబ్లిక్ డే స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న హంట్ పై సుధీర్ బాబు చాలా హోప్స్ పెట్టుకున్నాడు. హంట్ విజయం సాధించాలని ప్రమోషన్స్ తో చాలా కష్టపడ్డాడు. కోలీవుడ్ హీరో, బాయ్స్ ఫేమ్ భరత్ కూడా ఈ చిత్రంలో కీలకంగా కనిపించనున్నాడు. మరి హీరోయిన్ లేదు, సాంగ్స్ లేవు ఈ సినిమాని ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారో కానీ.. సుధీర్ బాబు కి ఈ చిత్రంతో హిట్ చాలా అవసరం.

హంట్ కానీ అటు ఇటు అయితే సుధీర్ బాబు కెరీర్ కూడా డైలమాలో పడినట్లే. ఈ చిత్రం కూడా ప్లాప్ అయితే సుధీర్ బాబు సినిమాలకి మర్కెట్ కూడా పడిపోతుంది. అలా జరక్కూడదంటే హంట్ ఖచ్చితంగా హిట్ అయ్యి తీరాల్సిందే. చూద్దాం హంట్ సుధీర్ బాబు కి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో అనేది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది.  

Hunt releasing tomorrow:

Sudheer Babu Hunt releasing tomorrow

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ