Advertisementt

డైవర్స్ కాకుండానే నరేష్ నాలుగో పెళ్లి

Fri 06th Jan 2023 10:07 AM
ramya raghupati,naresh  డైవర్స్ కాకుండానే నరేష్ నాలుగో పెళ్లి
Ramya Raghupati vs Naresh డైవర్స్ కాకుండానే నరేష్ నాలుగో పెళ్లి
Advertisement
Ads by CJ

సీనియర్ నటుడు నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో పెళ్ళికి సిద్దమయ్యాడు. ఈ న్యూ ఇయర్ కి పవిత్ర లోకేష్ తో కొత్త బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్టుగా ఓ వీడియో తో నరేష్ కన్ ఫర్మ్ చేసాడు. పవిత్ర లోకేష్ నరేష్ కి ముద్దుపెడుతున్న వీడియో అది. అయితే నరేష్ మూడో భార్య నరేష్-పవిత్ర లోకేష్ లపై దారుణమైన మాటలు మట్లాడుతూ వారిని పబ్లిక్ కి మరింతగా ఎక్స్పోజ్ చేసింది. నరేష్-పవిత్ర రిలేషన్ లో ఉన్నారని, తనని నరేష్ హింసిస్తున్నాడంటూ వాళ్ళిద్దరిని ఓ హోటల్ లో పట్టుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడు నరేష్ -పవితల పెళ్లి బంధంపై రమ్య ఎలా రియాక్ట్ అవుతుందా అని చాలామంది ఎదురు చూసారు. 

నరేష్-పవిత్రతో పెళ్ళికి సిద్దమవుతున్నట్లుగా చెప్పిన వీడియో షేర్ చెయ్యగానే రమ్య రఘుపతి యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూకి వచ్చేసింది. నరేష్ తనకి ఇంకా విడాకులు ఇవ్వలేదని, ఇంకా విడాకుల కేసు కోర్టులో ఉంది, ఏప్రిల్ లో విడాకుల కేసు ఫైల్ అయ్యింది, ఎలాగైనా నన్ను వదిలించుకుని ఆమెని పెళ్లాడాలనుకున్నాడు. అయితే నరేష్ నాకు విడాకులిచ్చాకే నాలుగో పెళ్లి కి సిద్దమై నాకు భారీగా భరణం ఇచ్చాడనే ప్రచారం జరుగుతుంది. కానీ అలాంటిదేం లేదు, అదంతా ఒట్టి పుకారు. నరేష్ నాకు ఇంకా విడాకులు కానీ, భరణం కానీ, ఇతరత్రా ఏమి ఇవ్వలేదు.

నరేష్ ముందు నుండి మంచివాడు కాదు, అతని నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది అంటూ రమ్య రఘుపతి నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Ramya Raghupati vs Naresh:

Ramya Raghupati comments on Naresh 4th marriage 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ