Advertisementt

రాజమౌళి అంటే ఫుట్ బాలే..!

Fri 30th Dec 2022 03:39 PM
prabhas,rajamouli,unstoppable  రాజమౌళి అంటే ఫుట్ బాలే..!
Prabhas on Rajamouli రాజమౌళి అంటే ఫుట్ బాలే..!
Advertisement
Ads by CJ

రాజమౌళి తో సినిమా చేస్తే.. సక్సెస్ విషయం అటుంచి హీరోలని తోమి తోమి, ఫుడ్ బాల్ ఆడిస్తారంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో  చెప్పారు. ప్రభాస్ ఛత్రపతి లాంటి యాక్షన్ చిత్రం తర్వాత బాహుబలి లాంటి పాన్ ఇండియా మూవీ చేసాడు. అయితే ఛత్రపతి మూవీ చేసినప్పుడే నీకు రాజమౌళి గురించి తెలుసుండాలి. అయినా బుద్దిరాలేదా.. మళ్ళీ రాజమౌళితో బాహుబలి సినిమా చేసావు అంటూ నందమూరి బాలకృష్ణ ఆహా అన్ స్టాపబుల్ టాక్ షోలో ప్రభాస్ ని ఆటపట్టించారు.

దానికి ప్రభాస్ కూడా నవ్వుతూ ఛత్రపతి చేసినప్పుడే రాజమౌళి అంటే తెలిసిపోయింది. రాజమౌళి విషయంలో నాకా అనుభవం ఉంది. ఛత్రపతి మొదలైన కొద్దిరోజులకే ఆయన ఎంత గొప్ప మనిషో అర్ధమయ్యింది. అప్పటినుండి నేను ఆయనికి ఫ్రెండ్ అయ్యాను. ఛత్రపతిలోని ప్రతి సీన్ ని నేను రెండు టెక్స్ చేస్తూ వెళ్ళాను, అంత ఫ్రీడమ్ ఇచ్చారాయన. ఎక్కువ జనం ఉన్నప్పుడు నాకు మొహమాటం సిగ్గుగా ఉండేది. అప్పుడు సైలెంట్ గా డైలాగ్ చెబుతాను అన్నా రాజమౌళి ఒప్పుకున్నారు. 

మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా షూటింగ్ అప్పుడు కె విశ్వనాథ్ గారు కూడా ఇలా అయితే ఎలాగయ్యా అన్నారు. ఇక రాజమౌళి గురించి నాకు తెలుసు కానీ.. రానాకీ తెలియదు. మనవాడు కాస్త ఫుట్ బాల్ ఆడుకుంటాడు అని ముందుగానే నేను రానాకి చెప్పాను. అయితే మనకి అలాంటి సినిమాలో మళ్లీ మళ్లీ ఛాన్స్ రాదు గనుక కష్టపడి చేశాము.. అంటూ ప్రభాస్ రాజమౌళి గురించి ఆహా స్టేజ్ పై గొప్పగా చెప్పాడు.

Prabhas on Rajamouli :

Prabhas about Rajamouli in Unstoppable stage

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ