నయన్ సినిమాకి థియేటర్స్ కష్టాలు

నయనతార ఈ ఏడాది పెళ్లి చేసుకుని సరోగసి ద్వారా తల్లయిన తర్వాత ఆమె నుండి ఆడియన్స్ ముందుకు రాబోతున్న చిత్రం కనెక్ట్. నయనతార భర్త నిర్మించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ రేపు శుక్రవారం విడుదల కాబోతుంది. ఈ సినిమా నిడివి జస్ట్ 99 నిమిషాలే. ఇంటర్వెల్ కట్ కూడా లేకుండా గంటన్నర సినిమాని చూడబోతున్నారంటూ విగ్నేష్ శివన్ అందరిని ఊరిస్తున్నాడు. నయనతార కూడా పెళ్లి తర్వాత ఓ సినిమాతో రాబోతున్న కారణంగా కనెక్ట్ పై అంచనాలు బావున్నాయి. అయితే ఇప్పుడు నయనతార కనెక్ట్ కి థియేటర్స్ ఓనర్స్ షాకిచ్చారు.
ఆమె సినిమాని థియేటర్స్ లో రిలీజ్ కానివ్వమంటూ వారు భీష్మించుకుని కూర్చోవడంతో నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ వారు రంగంలోకి దిగి థియేటర్స్ ఓనర్స్ తో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే కనెక్ట్ మూవీ ని ఎందుకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వనివ్వమంటున్నారంటే.. ఈ సినిమాకి ఇంటర్వెల్ లేదు అని చెప్పడమే కారణమని తెలుస్తుంది. ఇంటర్వెల్ లేకపోతే ఏమిటి అనుకోకండి.
సినిమాకి ఇంటర్వెల్ లేకపోతే.. ఆడియన్స్ బ్రేక్ తీసుకోరు కదా. బ్రేక్ తీసుకోకపోతే ఫుడ్ స్టాల్స్ నుండి థియేటర్స్ యాజమాన్యానికి ఆదాయం తగ్గుతుంది. అదే కారణంతో ఇప్పుడు థియేటర్స్ ఓనర్స్ అంతా నయన్ కనెక్ట్ ని ఇలా అయితే విడుదల కానివ్వమని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ సమస్యని పరిష్కరించేందుకు విగ్నేష్ శివన్ థియేటర్స్ యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నారట.
Theater owners refuse to release Nayanthara Connect
Theatres deny to screen Nayanthara Connect








































