Advertisementt

చప్పుడు చెయ్యని ఏజెంట్

Sun 04th Dec 2022 12:33 PM
akhil,agent,agent postponed  చప్పుడు చెయ్యని ఏజెంట్
Agent postponed again చప్పుడు చెయ్యని ఏజెంట్
Advertisement
Ads by CJ

సంక్రాంతికి సినిమా రిలీజ్ అని ప్రకటించేస్తే సరిపోదు.. సినిమాకి రిలీజ్ డేట్ ఇవ్వాలి, ఆ సినిమాని ప్రమోట్ చెయ్యడానికి టీమ్ రెడీగా ఉండాలి. ఇప్పుడు చూడండి ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ అన్న సినిమాలు వరస ప్రమోషన్స్ మొదలు పెట్టి తమ సినిమాలపై క్రేజ్ పెంచుకుంటుంటే, అఖిల్ ఏజెంట్ మాత్రం కామ్ గా వేడుక చూస్తుంది. సంక్రాంతి కి రిలీజ్ అన్న సినిమాల రిలీజ్ డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే వీర సింహ రెడ్డి జనవరి 12 న వస్తున్న అంటూ తేదీ ప్రకటించగా, విజయ్ వారసుడు డేట్ ఈ రోజు ఆదివారం సాయంత్రం ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోపక్క వాల్తేర్ వీరయ్య అనౌన్సమెంట్ సూన్ అనేలా ఉంది. ఇంత జరుగుతున్నా అఖిల్ టీమ్ మాత్రం మీనమేషాలు లెక్కబెడుతుంది.

గతంలో ఆగస్టు లో రిలీజ్ చేస్తామని ప్రకటించి వెనక్కి తగ్గారు. సరే సంక్రాంతి అన్నారు. కానీ మళ్ళీ ఇంతవరకు ఏజెంట్ అప్ డేట్ లేదు, సురేందర్ రెడ్డి ఏజెంట్ ని చెక్కుతున్నాడా? లేదంటే ఇంకేదన్నా జరుగుతుందో? అనేది అంతుబట్టడం లేదు. అటు అఖిల్ కానీ ఇటు ఏకే ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు కానీ, దర్శకుడు సూరి కానీ ఏజెంట్ విషయంలో మెయింటింగ్ చేస్తున్న సైలెన్స్ కి అక్కినేని ఫాన్స్ కి బీపీ వచ్చేస్తుంది.

ఏజెంట్ పాన్ ఇండియా మూవీ గా ప్రకటించడం కాదు, దానికి తగ్గ సన్నాహాలు చెయ్యాలి, అయ్యా నాగార్జున గారు సినిమా షూటింగ్స్ లేవు, కథలు లేవు, కనీస కొడుకు సినిమా అయినా పట్టించుకోండి అంటూ ఫాన్స్ రిక్వెస్ట్ లు ఎక్కువవుతున్నాయి. మరి రేపో మాపో అఖిల్ ఏజెంట్ వాయిదా న్యూస్ అఫీషియల్ గా వచ్చిన ఆశ్చర్యపోవక్కర్లేదు.

Agent postponed again:

Akhil Agent to be postponed again? 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ