12 బాలయ్య? 13 చిరంజీవి?

ఏ సంక్రాంతి అయినా.. సినిమాల రిలీజ్ ల విషయంలో విపరీతమైన పోటీ ఉంటుంది. స్టార్ హీరోలు చాలా వరకు పొంగల్ టార్గెట్ గా సినిమాని బాక్సాఫీసు దగ్గరకు తీసుకువస్తారు. కానీ ఈసారి సంక్రాంతి పోటీ కన్నా ఎక్కువగా కాట్రవర్సీ నడుస్తుంది. సినిమాలతో పోటీపడే హీరోలు కూల్ గానే ఉన్నారు. కానీ నిర్మాతలు కొట్టుకు చావల్సిన పరిస్థితి. రెండు పెద్ద సినిమాలను తెలుగులో ఒక్కరే నిర్మించారు. ఆ రెండు సినిమాలు సంక్రాంతికే ఫిక్స్ అయ్యి ఉన్నాయి. మరోపక్క తెలుగు, తమిళ్ లో తెరకెక్కిన మరో మూవీ కూడా సంక్రాంతికే అనడంతో వివాదం మొదలయ్యింది. ఆ వివాదం అలా ఉన్న తరుణంలో సీనియర్ హీరోలైన చిరు-బాలయ్య తగ్గేదెలా అంటున్నారు.
మైత్రి నిర్మాణంలో తెరకెక్కిన వాల్తేర్ వీరయ్య-వీర సింహ రెడ్డి రెండు సినిమాలు సంక్రాంతికి విడుదల అని ప్రకటించాయి. వినడానికి ఆసక్తిగా, చూడడానికి క్యూరియాసిటీగానే ఉన్నా.. నిర్మాతలు మాత్రం వణికిపోతున్నారు. ఇక దిల్ రాజు వారసుడు సంక్రాంతికే అంటున్నారు. సంక్రాంతికే అంటున్నారు తప్ప డేట్ లు మాత్రం ఇవ్వకుండా ఇంకా మేకర్స్ నాన్చుతూనే ఉన్నారు. తాజాగా బాలకృష్ణ వీర సింహ రెడ్డిని జనవరి 12 న రిలీజ్ చెంసేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే చిరు వాల్తేర్ వీరయ్యని ఆ తర్వాతి రోజు అంటే జనవరి 13 కి ఫిక్స్ చెయ్యబోతున్నారట.
మరి బాలయ్య సినిమాకి గట్టిగా ఓపెనింగ్స్ పడడం గ్యారెంటీ, అదే సినిమా హిట్ అయితే చిరు వాల్తేరు వీరయ్యకి ఓపెనింగ్స్ తగ్గుతాయి. డివైడ్ టాక్ వస్తే చిరు సేఫ్ లేదంటే నిర్మాతలకి లాస్ అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. రీసెంట్ గాను వారసుడు సంక్రాంతి రిలీజ్ అంటున్నారు. కానీ డేట్ ఇవ్వలేదు. బాలయ్య 12 కి వస్తుంటే.. చిరు 13 కి వస్తున్నారన్నమాట.
Waltair Veerayya on January 12th and Veera Simha Reddy on January 13th
Release dates of Waltair Veerayya and Veerasimha Reddy







































