Advertisementt

బిగ్ బాస్ విన్నర్ బిందు మాధవి ఏం చేస్తుందో?

Wed 23rd Nov 2022 07:56 PM
bigg boss,bindu madhavi,revanth  బిగ్ బాస్ విన్నర్ బిందు మాధవి ఏం చేస్తుందో?
What is Bigg Boss winner Bindu Madhavi doing? బిగ్ బాస్ విన్నర్ బిందు మాధవి ఏం చేస్తుందో?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్స్ వస్తున్నాయ్, పోతున్నాయ్.. బిగ్ బాస్ లో పోరాడి గెలిచి కప్ పట్టుకుని ఇంటికెళ్లిన వారు ఇంటి దగ్గరే ఉంటున్నారు.. కానీ క్రేజ్ వచ్చేసి సినిమాల్లో హీరోలుగా హీరోయిన్స్ గా చెలామణి అయిపోదామనుకున్న వారికి మీకంత సీన్ లేదు అంటూ ఇంట్లోనే కూర్చోవాల్సిన అగత్యం. తెలుగులో మొదటి విన్నర్ గా నిల్చిన శివ బాలాజీ దగ్గర నుండి గత సీజన్ విన్నర్ బిందు మాధవి వరకు ఒకటే జరిగింది. ఏదో సీజన్ 4 విన్నర్ సన్నీ హడావిడే కానీ.. అతను ఓపెన్ గానే చెప్పాడు. బిగ్ బాస్ కెళ్ళినంత మాత్రం ఉపయోగం ఏం లేదు అని. 

మరి ఈ సీజన్ లో టైటిల్ ఫెవరెట్ గా మారిన రేవంత్.. ఇంతకూ ముందే మంచి క్రేజ్ ఉన్న సింగర్. అతను ఈ సీజన్ లోకి ఎందుకు వచ్చాడో ఎవరికీ అర్ధమే కావడం లేదు. ఏదో మంచి పట్టున్న ఆటగాడిగా రేవంత్ కనిపిస్తున్నాడు.. ఇండియన్ ఐడల్ అయ్యుండి రేవంత్ ఇలా బిగ్ బాస్ లోకి వచ్చి కప్ గెలిచి ఏం చేస్తాడో చూడాలి. ఏది ఏమైనా విన్నర్స్ మాత్రం ఏదో సాధిద్దామనుకుని ఎగిరి గంతెలిసినా ఏం సాధించలేక చేతులెత్తేస్తున్నారు.

గత సీజన్ విన్నర్ బిందు మాధవి టాస్క్ ల పరంగా వీక్ అయినా.. కేరెక్టర్ పరంగా ఆమె క్రేజీగా కప్ అందుకుంది. తర్వాత గ్లామర్ చూపిస్తూ ఫోటో షూట్స్ వదిలినా.. బిందు మాధవికి ఆఫర్స్ ఇచ్చినవారు లేరు. ఆఖరికి మాటిచ్చాడన్న అనిల్ రావిపూడి కూడా బిందు మాధవి విషయంలో కామ్ గానే కనిపిస్తున్నారు.

What is Bigg Boss winner Bindu Madhavi doing?:

Bigg Boss 5 winner Bindu Madhavi status

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ