Advertisement

నాగ శౌర్య వెడ్డింగ్: ఫస్ట్ వీడియో అవుట్

Sun 20th Nov 2022 12:15 PM
naga shaurya,naga shaurya-anusha wedding video out  నాగ శౌర్య వెడ్డింగ్: ఫస్ట్ వీడియో అవుట్
Naga Shaurya wedding video out నాగ శౌర్య వెడ్డింగ్: ఫస్ట్ వీడియో అవుట్
Advertisement

యంగ్ హీరో నాగ శౌర్య ఓ ఇంటివాడయ్యాడు. కర్ణాటకకు చెందిన అనూష తో ఈ రోజు నవంబర్ 20 ఆదివారం ఉదయం 11.30 నిమిషాలకి నాగ శౌర్య వివాహం అంగరంగ వైభవముగా జరిగింది. ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అయిన అనూష తో నాగ శౌర్య ఏడడుగులు నడిచాడు. బెంగుళూర్ వేదికగా జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా నిన్న శనివారం మెహిందీ, హల్దీ సెర్మోనీలని గ్రాండ్ గా నిర్వహించారు. ఆ తదుపరి కాక్ టైల్ పార్టీని నిర్వహించినట్లుగా తెలుస్తుంది.

ఇక నాగ శౌర్య - అనూష ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిపోయింది. కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్యన నాగ శౌర్య-అనుషల వివాహం చూడముచ్చటగా జరగగా, శౌర్య తల్లితండ్రులు ఈ వేడుకల్లో ఎంతో సంతోషంగా కొత్త జంటని దీవించారు. నాగ శౌర్య-అనుషాల వివాహంలో వారు తలంబ్రాలు పోసుకుంటున్న వీడియో బయటికి వచ్చింది. ఆ వీడియో చూసిన అందరూ ఈ కొత్త జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Naga Shaurya wedding video out:

Naga Shaurya wedding celebrations

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement