ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 6: Top 5 revealed, Winner Fix

బిగ్ బాస్ 6: టాప్ 5 వారే, విన్నర్ ఫిక్స్

బిగ్ బాస్ సీజన్ 6 లో టాప్ 5 కంటెస్టెంట్ అవుతాడనుకున్న స్ట్రాంగ్ ప్లేయర్ RJ సూర్య ఇనాయ వలన ఎనిమిదో వారంలోనే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. బయటికి వచ్చాక టాప్ 5 లో రేవంత్, శ్రీహన్, గీతూ, ఆది రెడ్డి, ఫైమా ఉంటారని చెప్పిన సూర్య.. ఇప్పుడు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టాప్ 5 కంటెస్టెంట్స్, అలాగే విన్నర్ పై మరోమారు సంచలనంగా మాట్లాడాడు. టాప్ 5 లో ఎవరుంటారు, మీరు బిగ్ బాస్ వాయిస్ తో చెప్పమని అడగగా.. దానికి సూర్య బిగ్ బాస్ వాయిస్ ని ఇమిటేట్ చేస్తూ.. సీజన్ 6 టాప్5 లో రేవంత్ అన్నా, శ్రీహన్, గీతూ ఉంటారనుకున్నాను. 

కానీ గీతూ అనుకోకుండా ఎలిమినేట్ అయ్యింది. గీతూ స్థానంలో ఇనాయ వచ్చింది అని చెప్పాడు. ఇంకా ఆది రెడ్డి, ఫైమా కూడా టాప్ 5 లో ఉండొచ్చని చెప్పాడు. మరి మీ ఊహ ప్రకారం బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికుంది అని అడగగా.. దానికి సూర్య.. నేను అక్కడ బిగ్ బాస్ స్టేజ్ పై చెప్పాను, హౌస్ లో ఉన్నప్పుడు గెస్ చేశాను, బయటికొచ్చాకా కూడా రేవంత్ అన్నే విన్నర్ అని అనుకుంటున్నాను, హౌస్ లో ఉన్నప్పుడు రేవంత్ అనే అనుకున్నాను, నాగ్ సర్ అడిగితే అదే చెప్పాను.

ఇప్పుడు బయటికొచ్చాక ఎపిసోడ్స్ చూసాక, అలాగే బయట వింటున్న టాక్ బట్టి కూడా రేవంత్ అనే చెబుతాను, ఆయన కాస్త అగ్రెసివ్ నెస్ తగ్గించుకుంటే.. ఎలాంటి టెన్షన్ లేకుండా బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ అవడం పక్కా అంటూ RJ సూర్య ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Bigg Boss 6 RJ Surya interview

Bigg Boss 6: Top 5 revealed, Winner Fix
bigg boss 6
rj surya interview