ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nikki Galrani reacts pregnancy rumours

ప్రెగ్నెన్సీ వార్తలపై ఫైర్ అవుతున్న హీరోయిన్

ఈ ఏడాది కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గాల్రానీలు ప్రేమ వివాహం అందరిలో హాట్ టాపిక్ గా నిలిచింది. కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్న ఈ జంట కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ పెళ్లి పీటలెక్కింది. టాలీవుడ్ నుండి నాని, సందీప్ కిషన్, నీరజ కోన లాంటి సెలబ్రిటీస్ ఆది పినిశెట్టి-నిక్కీ గల్రాని ల వివాహానికి హాజరయ్యారు. తర్వాత ఇద్దరూ పెళ్లి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, ఆ తర్వాత హాని మూన్ ట్రిప్ వేసింది ఈ జంట. పెళ్లి తర్వాత నిక్కీ గల్రాని కొత్త సినిమాలు ఒప్పుకోలేదు.

అయితే గత రెండు రోజులుగా ఆది పిన్నిశెట్టి తండ్రి కాబోతున్నాడంటూ వార్తలు రావడం, నిక్కీ గల్రాని ప్రెగ్నెంట్ అనే న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. నిక్కీ-ఆది దంపతులు త్వరలోనే తల్లితండ్రులు కాబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే నిక్కీ గల్రాని తన ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించింది. నేను ప్రెగ్నెంట్ అంటూ కొంతమంది గాసిప్స్ ప్రచారం చేస్తున్నారు, ఓ పని చెయ్యండి నా డెలివరీ కూడా మీరే చేసెయ్యండి అంటూ సెటేరికల్ గా కామెంట్ పోస్ట్ చేసింది. 

అంతేకాకుండా ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ కాదు, ఫ్యూచర్ లో మాత్రం నేను తప్పకుండా ప్రెగ్నెంట్ అవుతాను, అప్పుడే నేనే స్వయం ఆ శుభవార్త చెబుతాను, కానీ ఇప్పుడు ఇలాంటి వార్తలను నమ్మకండి అంటూ సోషల్ మీడియా ద్వారా నిక్కీ గల్రాని తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలని కొట్టి పారేసింది.

Actress Nikki Galrani Responds on Her Pregnancy Rumors

Nikki Galrani reacts pregnancy rumours
actress nikki galrani
adi pini shetty