Advertisementt

నాగ శౌర్య హెల్త్ అప్ డేట్ పై ఫాన్స్ వెయిటింగ్

Thu 17th Nov 2022 03:58 PM
naga shaurya,naga shaurya health update  నాగ శౌర్య హెల్త్ అప్ డేట్ పై ఫాన్స్ వెయిటింగ్
Fans waiting on Naga Shaurya health update నాగ శౌర్య హెల్త్ అప్ డేట్ పై ఫాన్స్ వెయిటింగ్
Advertisement
Ads by CJ

యంగ్ హీరో నాగ శౌర్య రెండు రోజుల క్రితం షూటింగ్ స్పాట్ లో సొమ్మసిల్లి పడిపోవడంతో చిత్ర బృందం ఆయనని హైదరాబాద్ లోని AIG ఆసుపత్రిలో జాయిన్ చేసిన విషయం తెలిసిందే. అయితే నాగ శౌర్య సిక్స్ ప్యాక్ ట్రై చెయ్యడంతో.. ఫుల్ గా డైట్ చేస్తూ నాలుగు రోజులుగా కనీసం వాటర్ కూడా తాగకపోవడం వలనే డీ-హైడ్రేషన్ అయ్యి నాగ శౌర్య కళ్ళు తిరిగిపడిపోయినట్లుగా ఆయన స్నేహితులు చెబుతున్నారు. మరోపక్క నాగ శౌర్యకి డీ-హైడ్రేషన్ కారణంగా వైరల్ ఫీవర్ కూడా ఎటాక్ అవడంతో ఆయనని నిన్నటివరకు ఆసుపత్రిలో ఉంచినట్లుగా తెలుస్తుంది.

అసలు నాగ శౌర్య హెల్త్ అప్ డేట్ ఏమిటో తెలియక ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు. మరోపక్క నాగ శౌర్య పెళ్లి దగ్గరపడుతోంది. నాగ శౌర్య ఇలా అనారోగ్యం పాలవడంతో కుటుంబ సభ్యులు కూడా ఆందోళనలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఇటు ఇండస్ట్రీలోని ప్రముఖులని పెళ్ళికి పిలవడానికి నాగ శౌర్య పేరెంట్స్ వెళ్లాల్సి ఉంది. బెంగుళూర్ వేదికగా నాగ శౌర్య వివాహం ఈ నెల 20 న అనూషతో జరగనుంది. 

అనూషతో నాగ శౌర్య ఏడడుగులు నడవడానికి సమయం దగ్గర పడుతుండంతో.. నాగ శౌర్య ఇంకా ఆసుపత్రిలో ఉన్నాడా.. లేదంటే హెల్దీగా ఆసుపత్రి నుండి డిశ్ ఛార్జ్ అయ్యాడో తెలియక ఆయన ఫాన్స్ అయోమయంలో ఉన్నారు. 

Fans waiting on Naga Shaurya health update:

Naga Shaurya faints during film shoot due to high grade viral

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ