Advertisementt

పాపం త్రివిక్రమ్

Tue 15th Nov 2022 08:44 PM
ssmb28,mahesh babu,trivikram  పాపం త్రివిక్రమ్
What is the situation of Trivikram పాపం త్రివిక్రమ్
Advertisement
Ads by CJ

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రివిక్రమ్ బన్నీ తో అలా వైకుంఠపురములో సినిమాతో హిట్ కొట్టేసి రెండేళ్లు గడిచిపోయింది. కానీ ఇంతవరకు ఆయన నెక్స్ట్ సినిమా షూటింగ్ సజావుగా జరగడం లేదు. ఆలా వైకుంఠపురములో తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మూవీ కమిట్ అయ్యి అనౌన్సమెంట్ వచ్చాక అది ఆగిపోయింది. ఎన్టీఆర్ ప్లేస్ లోకి మహేష్ బాబు వచ్చాడు. 12 ఏళ్ళ తర్వాత కలుస్తున్న ఈ కాంబోపై అంచనాలు మిన్నంటాయి. కానీ త్రివిక్రమ్-మహేష్ సినిమా అనౌన్సుమెంట్ వచ్చి నెలలు గడిపోయాయి. ఎలాగో సెప్టెంబర్ లో ఆ సినిమా పట్టాలెక్కింది. ఈ లోపు మహేష్ లుక్ పై అనుమానాలు, తీసిన యాక్షన్ సీన్ పై అపోహలు రావడంతో.. మొదటి షెడ్యూల్ కి హడావిడిగా బ్రేకులు వేశారు.

తర్వాత సెకండ్ షెడ్యూల్ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ విషయంలో మార్పులు , చేర్పులు చేసుకుంటున్న తరుణంలో మహేష్ తల్లి ఇందిరగారు మరణించారు. అలా ఓ 15 రోజులు గడిచిపోయాయి. అమ్మ మరణం నుండి కోలుకోవడానికి మహేష్ ఫారిన్ ట్రిప్ కి వెళ్ళాడు. మహేష్ హైదరాబాద్ కి వచ్చాడు.. త్రివిక్రమ్ తో సెకండ్ షెడ్యూల్ అనుకుంటున్న తరుణంలో అనుకోకుండా మహేష్ తండ్రి కృష్ణ గారు కాలం చేసారు. మరి ఇవన్నీ పూర్తి చేసి మహేష్ ఆ బాధ నుండి కోలుకుని మునుపటిలా మాములు అయ్యి.. ఎప్పుడు SSMB28 సెట్స్ మీదకి వస్తాడా అని త్రివిక్రమ్ ఎదురు చూడడం తప్ప ఇంకేం చేసేది లేదు.

What is the situation of Trivikram:

SSMB28 shooting dilemma

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ