Advertisementt

హాస్పిటల్ లోనే నాగ శౌర్య

Tue 15th Nov 2022 05:03 PM
naga shaurya,viral fever  హాస్పిటల్ లోనే నాగ శౌర్య
Naga Shaurya Hospitalised హాస్పిటల్ లోనే నాగ శౌర్య
Advertisement
Ads by CJ

నిన్న సోమవారం షూటింగ్ స్పాట్ లో సొమ్మసిల్లి పడిపోయిన నాగ శౌర్య ని చిత్రం బృందం హుటాహుటిన హైదరాబాద్ లోని AIG ఆసుపత్రికి తరలించారు. అయితే నాగ శౌర్య కొద్దిరోజులుగా డైట్ ఫాలో అవుతుండడంతో అతను సరిగ్గా ఆహారం తీసుకొని కారణంగా నీరసంతోనే కళ్ళు తిరిగిపడిపోయాడన్నారు. అయితే నిన్న ఆసుపత్రిలో జాయిన్ అయిన నాగ శౌర్య ఇంకా డిశ్ ఛార్జ్ అవ్వలేదని తెలుస్తుంది. నిన్న ఇంటి నుండి షూటింగ్ స్పాట్ కి వెళ్ళినప్పుడే అతను నీరసంగా ఉన్నాడట.

లొకేషన్ కి వెళ్ళగానే ఆ నీరసంతోనే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనడంతో నాగ శౌర్య స్పృహ తప్పాడని, ఆ యాక్షన్ సన్నివేశం కోసం నాగ శౌర్య సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నాడట. అందుకోసం నాలుగు రోజులుగా కనీసం నీళ్లు కూడా తాగకపోవడం వలనే నాగ శౌర్య అంతగా సిక్ అయ్యాడని తెలుస్తుంది. మరోపక్క నాగ శౌర్యకి వైరల్ ఫీవర్ కూడా తోడవడంతో.. అతన్ని డాక్టర్స్ ఇంకా అబ్జర్వేషన్ లోనే ఉంచారట. మరోపక్క నాగ శౌర్య పెళ్లి డేట్ దగ్గర పడుతుంది. ఈ నెల 20 న బెంగుళూర్ లో నాగ శౌర్య వివాహం జరగనుంది. రెండు రోజుల్లో పెళ్లి వేడుకల కోసం నాగ శౌర్య బెంగుళూర్ వెళ్లాల్సి ఉన్న టైం లో ఇలా ఆసుపత్రి పాలవడం ఆయన ఫ్యామిలీకి ఆందోళన కలిగిస్తుంది.

Naga Shaurya Hospitalised:

Naga Shaurya Hospitalised Due To Viral Fever

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ