Advertisementt

సమంత యశోద ఓపెనింగ్స్ ప్రభంజనం

Sat 12th Nov 2022 02:08 PM
samantha,yashoda movie  సమంత యశోద ఓపెనింగ్స్ ప్రభంజనం
Samantha Yashoda day 1 collections సమంత యశోద ఓపెనింగ్స్ ప్రభంజనం
Advertisement
Ads by CJ

ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సీరీస్ తో పాన్ ఇండియా స్టేటస్ అందుకున్న సమంత ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ సినిమాల్లో హీరోయిన్ సెంట్రిక్ మూవీ చేస్తుంది. ఇప్పటికే సమంత నటించిన యశోద పాన్ ఇండియాలోని పలు భాషల్లో విడుదల కాగా.. ఆమె మరో చిత్రం శాకుంతలం విడుదలకు రెడీ అవుతుంది. యశోద పోస్టర్స్ తో, ట్రైలర్ తో అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసిన టీం, సమంత హెల్త్ పరంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న టైం లో ఆమె సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో.. యశోదకి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ దక్కాయి. స్టార్ హీరోల రేంజ్ లో సమంత యశోదకి ఓపెనింగ్స్ తీసుకురావడం చర్చనీయాంశం అయ్యింది. అటు ఓవర్సీస్ లోను యశోద ప్రభంజనం మొదటి రోజు థియేటర్స్ దగ్గర కనిపించింది.

యశోద మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 6.32 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టుగా మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసారు. కేవలం సమంత స్టామినాతోనే ఈ రకమయిన వసూళ్లు వచ్చాయని ట్రేడ్ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. సమంత యశోద గా వన్ మ్యాన్ షో చేసింది అని, సమంత నటనే సినిమాకి హైలెట్ అని ఆడియెన్స్ ముక్తకంఠంతో చెప్పడం, అటు థియేటర్స్ లో కూడా మంచి ఆక్యుపెన్సీ కనిపించడం అలాగే సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో యశోద కలెక్షన్స్ వీకండ్ లో మరింతగా పుంజుకునే అవకాశం కనిపిస్తుంది.

Samantha Yashoda day 1 collections :

Samantha Yashoda collections update

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ