Advertisementt

బిగ్ బాస్ 6: ఒంటరివాడైన రేవంత్

Thu 10th Nov 2022 11:04 AM
bigg boss 6,revanth,srihan  బిగ్ బాస్ 6: ఒంటరివాడైన రేవంత్
Bigg Boss 6: Revanth is a loner బిగ్ బాస్ 6: ఒంటరివాడైన రేవంత్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 లోకి టైటిల్ ఫెవరెట్ గా బరిలోకి దిగిన సింగర్ రేవంత్ మొదటి వారం నుండే తన ప్రత్యేకతని చాటుతున్నాడు. టాస్క్ విషయంలో కానీ, ఎంటర్టైన్మెంట్ విషయంలో కానీ, పని విషయంలో కానీ, ఆఖరికి బిగ్ బాస్ లో నిద్రపోతూ దొరికిపోయిన విషయంలో కానీ అన్నిటిలో రేవంత్ నెంబర్ 1. కాకపోతే టాస్క్ ల విషయంలో రేవంత్ చాలా అగ్రెసివ్ గా ఉంటున్నాడు. దానితో నాగార్జున అతని నోటిని అదుపులో పెట్టుకోమని వార్నింగ్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా గేమ్ లో ఫిజికల్ అవ్వకుండా ఎల్లో కార్డ్ చూపించడంతో ఈ వారం ఆటలో రేవంత్  చేతులు, కాళ్ళు కట్టేసినట్టుగా ఫీలయ్యాడు.

గత రాత్రి కెప్టెన్సీ టాస్క్ లో రేవంత్ ని ఫిజికల్ అవుతున్నాడు ఫిజికల్ అవుతున్నాడంటూ వేరే టీం వాళ్ళు బ్లేమ్ చేసి అతని వీక్నెస్ మీద దెబ్బకొట్టడంతో.. రేవంత్ ఏం చెయ్యలేక కామ్ అయ్యాడు. అలాగే వాళ్ళ టీం కూడా ఓడిపోవడంతో.. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుండి వైదొలిగారు. దానితో రేవంత్ బాగా ఫీలైపోయాడు. ఒంటరిగా కూర్చుని ఏడ్చేశాడు. అనవసరంగా బిగ్ బాస్ హౌస్ కి వచ్చాను అంటూ తనని తానే తిట్టుకున్నాడు. సత్య, శ్రీహన్ వచ్చి ఓదార్చినా రేవంత్ ఊరుకోలేదు. తర్వాత ఆది రెడ్డి దగ్గర కూర్చుని అనవసరంగా బిగ్ బాస్ హౌస్ కి వచ్చాను, రాకుండా ఉన్నా పోయేది అంటూ ఫీలవుతూ భార్య ఫోటో దగ్గర కన్నీళ్లు పెట్టుకోవడం ఆయన ఫాన్స్ ని కలిచివేసింది.

Bigg Boss 6: Revanth is a loner:

Bigg Boss 6: Today promo highlights

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ