సీఎం గా ప్రియమణి

పెళ్లి తర్వాత కూడా సీనియర్ హీరోలకి కేరాఫ్ అడ్రెస్స్ గా మారిన ప్రియమణి ప్రస్తుతం కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను, హీరోయిన్ గాను సత్తా చాటుతుంది. టీవీ షోస్ కి జేడ్జ్ గాను వెళుతున్న ప్రియమణి ప్రస్తుతం భర్త కి దూరంగా ఉంటుంది అనే న్యూస్ ఎప్పటినుండో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముస్తఫా తో ప్రియమణి విడాకుల వరకు వెళ్లినట్లుగా ప్రచారము జరుగుతుంది. అందుకే ప్రియమణి ఎక్కువగా కెరీర్ మీదే ఫోకస్ పెట్టింది అంటున్నారు.
అదలా ఉంటే ప్రియమణి విరాట పర్వం తర్వాత నాగ చైతన్య మూవీలో నటిస్తుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ్ లో తెరకెక్కుతున్న NC22 సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాలో అరవింద్ స్వామి నాగ చైతన్యని ఢీ కొట్టబోయే విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రియమణి రోల్ రివీల్ అయ్యింది. ఇందులో ఆమె పొలిటికల్ లీడర్ గా సీఎం కేరెక్టర్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. పవర్ ఫుల్ ముఖ్యమంత్రి పాత్రలో ప్రియమణి గ్లామర్ గా విశ్వరూపం చూపిస్తుందట. NC22 లో నాగ చైతన్య కి జోడిగా కృతి శెట్టి నటిస్తుంది.
Priyamani to play a CM role in NC22
Priyamani to play a CM role







































