Advertisementt

చిక్కుల్లో షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ

Sat 05th Nov 2022 10:51 PM
jawan,shah rukh khan,atlee  చిక్కుల్లో షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ
Jawan: Shah Rukh Khan film faces plagiarism allegations చిక్కుల్లో షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ
Advertisement
Ads by CJ

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ కి వెళ్లి అక్కడి హీరో షారుఖ్ తో జవాన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన నయనతార నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న జవాన్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. అది దర్శకుడు అట్లీ జవాన్ కథని కాపీ కొట్టాడంటూ.. మాణిక్యం నారాయణన్ అనే నిర్మాత కోలీవుడ్ నిర్మాతల మండలిలో కంప్లైంట్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. జవాన్ ని కేవలం హిందీలోనే కాకుండా సౌత్ లో కూడా రిలీజ్ చేసే ప్లాన్స్ లో నిర్మాతలు ఉన్నారు.

కారణం హీరో ఒక్కడే బాలీవుడ్. మిగతా టీం అంటే డైరెక్టర్, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అంతా కోలీవుడ్ వాళ్లే. సో జవాన్ హిందీలోనే కాకుండా సౌత్ లో కూడా విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు మేకర్స్. అయితే అట్లీ ఈ కథని 2006 లో విజయ్ కాంత్ హీరోగా వచ్చిన పేరరసు సినిమా కథని కాపీ కొట్టి జవాన్ పేరుతో సినిమా తీస్తున్నాడు అని, అట్లీ పై కాపీ రైట్ యాక్ట్ కింద తగిన చర్యలు తీసుకోవాలంటూ మాణిక్యం నారాయణన్ అనే కోలీవుడ్ నిర్మాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేసాడు. ఈ విషయమై అట్లీ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Jawan: Shah Rukh Khan film faces plagiarism allegations:

Jawan: Shah Rukh Khan film faces plagiarism allegation, producer files complaint

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ