Advertisementt

ఆ సీన్స్ చెయ్యడం కృతి తల్లికి ఇష్టం లేదట

Thu 03rd Nov 2022 09:17 PM
kriti sanon,karan johar,lust stories rejection  ఆ సీన్స్ చెయ్యడం కృతి తల్లికి ఇష్టం లేదట
Kriti Sanon rejected Lust Stories web series ఆ సీన్స్ చెయ్యడం కృతి తల్లికి ఇష్టం లేదట
Advertisement
Ads by CJ

తెలుగులో రెండు మూడు సినిమాల్లో నటించినా రాని క్రేజ్ ఆదిపురుష్ లో ప్రభాస్ తో జోడి కట్టగానే సౌత్ ప్రేక్షకుల చూపు కృతి సనన్ మీద పడింది. బాలీవుడ్ లో హీరోయిన్ గా నిరూపించుకున్న కృతి సనన్ ని సౌత్ లైట్ తీసుకుంది. అయితే ఆదిపురుష్ తో పాన్ ఇండియా లేవల్లో సత్తా చాటడానికి రెడీ అయిన కృతి సనన్ కి నటనలో కొన్నిపరిమితులున్నాయట. అంటే కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించడానికి కృతి సనన్ కి ఆమె తల్లి అనుమతి కావాలట. ఆమె మాత్రం అలాంటి బోల్డ్ సీన్స్ లో కృతి నటించడానికి అస్సలు ఒప్పుకోదంట. అలా కృతి సనన్ బాలీవుడ్ లో ఓ మంచి ఛాన్స్ కూడా పోగొట్టుకున్నగా ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది.

బాలీవుడ్ లో కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దివాకర్ కలయికలో ఓ వెబ్ సీరీస్ వచ్చింది. ది లాస్ట్ స్టోరీస్ అనే సీరీస్. అది ఎంత పెద్ద హిట్ అనేది అందరికి తెలుసు. ఆ సీరీస్ తోనే కియారా అద్వానీకి బాలీవుడ్ లో ఎదురు లేకుండా పోయింది. ఆ సీరీస్ లో కియారా అద్వానీ బోల్డ్ గా రెచ్చిపోయింది. అయితే కియారా కేరెక్టర్ కృతి సనన్ చెయ్యాల్సి ఉంది. కరణ్ జోహార్ కియారకన్నా ముందే కృతి సనన్ ని సంప్రదించగా ఆమె ఆ ఆఫర్ కి నో చెప్పినట్లుగా తెలిసిన విషయమే. అయితే ఆ సీరీస్ కి నో చెప్పడానికి కారణం మాత్రం కృతి రీసెంట్ గా బయటపెట్టింది. ఆమె తల్లి బోల్డ్ సీన్స్ లో నటించొద్దని ముందే చెప్పడంతో కృతి సనన్ ఆ ఆఫర్ ని వదులుకున్నట్టుగా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Kriti Sanon rejected Lust Stories web series:

Kriti Sanon Mother Breaks Silence On Lust Stories Rejection

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ