Advertisementt

సైలెంట్ గా ఓటిటిలోకి నాగ్ ఘోస్ట్

Wed 02nd Nov 2022 10:21 AM
the ghost,netflix,nagarjuna  సైలెంట్ గా ఓటిటిలోకి నాగ్ ఘోస్ట్
The Ghost OTT release సైలెంట్ గా ఓటిటిలోకి నాగ్ ఘోస్ట్
Advertisement
Ads by CJ

నాగార్జున-ప్రవీణ్ సత్తారు కలయికలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ద ఘోస్ట్ అక్టోబర్ 5 దసరా సందర్భంగా రిలీజ్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ తో పోటీ పడి చేతులు కాల్చుకుంది. ప్రవీణ్ సత్తారు మేకింగ్ స్టయిల్ కానీ, నాగార్జున యాక్షన్ కానీ ఆడియన్స్ కి నచ్ఛలేదు అన్నమాట కాదు కానీ, హెవీ కాంపిటీషన్ మధ్యన దిగడం ఘోస్ట్ కి మైనస్ అయ్యింది. ఘోస్ట్ మూవీ ఫైనల్ గా డిసాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. నాగార్జున-సోనాల్, దర్శకుడు ప్రవీణ్ సత్తారు ప్రమోషన్స్ గట్టిగానే చేసారు. కానీ సినిమాకొచ్చిన నెగెటివ్ టాక్ కలెక్షన్స్ మీద ప్రభావం చూపాయి. 

అక్టోబర్ 5 న విడుదలైన ద ఘోస్ట్ ఇప్పుడు సైలెంట్ గా ఓటిటిలోకి వచ్చేసింది. నవంబర్ 2 అంటే ఈ రోజు నుండే నాగార్జున ద ఘోస్ట్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. అయితే ప్లాప్ సినిమాకి ఓటిటి ప్రమోషన్ ఎందుకు అనుకున్నారో ఏమో.. ఎలాంటి ప్రకటన లేకుండా నెట్ ఫ్లిక్స్ లోకి సైలెంట్ గా దింపేశారు. తెలుగు, తమిళ భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో ఈ రోజు నుండి స్ట్రీమింగ్ లోకి వచ్చిన ఘోస్ట్ ని చూసిన ఆడియన్స్ అదేమిటి గప్ చుప్ గా ఓటిటోలోకి వదిలేసారు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

The Ghost OTT release:

The Ghost releasing Netflix on 2nd November

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ