Advertisementt

సల్మాన్ ఖాన్ కి Y+ సెక్యూరిటీ

Tue 01st Nov 2022 05:01 PM
salman khan,y+ category,akshay kumar  సల్మాన్ ఖాన్ కి Y+ సెక్యూరిటీ
Maharashtra Government increases Salman Khan security సల్మాన్ ఖాన్ కి Y+ సెక్యూరిటీ
Advertisement
Ads by CJ

ముంబై స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రాణాలకు ప్రమాదం ఉంది అని, ముంబై గ్యాంగ్ స్టర్స్ నుండి సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు రావడంతో మహారాష్ట్ర సర్కార్ సల్మాన్ ఖాన్ కి సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. ఎప్పటినుండో సల్మాన్ ఖాన్ ని  బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసినట్లుగా ముంబై పోలీస్ లకి ఆదారాలు దొరకడంతో..  బిష్ణోయ్ గ్యాంగ్ లో కొంతమందిని అరెస్ట్ చేసారు. అప్పుడే సల్మాన్ ఖాన్ కోర్టుకి వెళ్లి తనకి భద్రతా కలిపించాల్సిందిగా కోరడంతో.. అప్పట్లో మహా రాష్ట్ర సర్కార్ సల్మాన్ కి X కేటగిరి సెక్యూరిటీ కల్పించింది. సల్మాన్ ఖాన్ కూడా లైసెన్సుడ్ తుపాకిని కొనుగోలు చేసాడు.

అయితే ఇప్పుడు మరోసారి బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు ఎక్కువ కావడంతో ఇప్పడు మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ ఖాన్ కి భద్రతని మరింతగా పెంచింది. X కేటగిరి నుండి Y+ కేటగిరికి సెక్యూరిటీ ని పెంచడమే కాకుండా.. సల్మాన్ ఖాన్ కూడా షూటింగ్ కి ఎక్కడికి హాజరైనా వ్యక్తిగత భద్రతా సిబ్బందిని పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ముంబైలో ప్రస్తుతం కొన్ని గ్యాంగ్ లు యాక్టీవ్ అవడంతో.. సల్మాన్ ఖాన్ తో పాటు అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్ లకు కూడా X క్యాటగిరి భద్రతను కల్పించాలని మహారాష్ట్ర రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది.

Maharashtra Government increases Salman Khan security :

Salman Khan gets Y+ category security

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ