బిగ్ బాస్ 6: కీర్తి కన్నీళ్ళు, శ్రీహన్ ఫైర్

Bigg Boss 6: Today promos highlights Bigg Boss 6: Today promos highlights

బిగ్ బాస్ సీజన్ 6 ఎనిమిదో వారానికి గాను కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. కీర్తి-శ్రీహన్-సూర్యలు ఫైనల్ గా కెప్టెన్ అవడం కోసం పోటీ పడుతున్నారు. అయితే అందరూ శ్రీహన్ ని సపోర్ట్ చేస్తూ ఇంతకుముందు కెప్టెన్ అయిన కీర్తి-సూర్య లకి కత్తి గుచ్చుతున్నారు. తగిన కారణాలు కూడా చెబుతున్నారు. అయితే శ్రీహన్ ని సపోర్ట్ చెయ్యకుండా ఇనాయ అతనికి కత్తి గుచ్చడంతో శ్రీహన్ బాగా ఫీలయ్యాడు. ఇక ఈ రోజు కీర్తికి ఎక్కువ కత్తిపోట్లు పడడంతో ఆమె ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు సూర్యతో ఎంత చేసినా హౌస్ మేట్స్ కి అస్సలు కనిపించడం లేదు, ఇక్కడ కూడా బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్ పెడితే బావుండు అంది. నువ్వు మొదటిసారి కెప్టెన్ అయినప్పుడు కూడా హౌస్ మేట్స్ నీకు సపోర్ట్ చేసారు అన్నాడు సూర్య.. దానితో కీర్తి కొద్దిగా హార్ట్ అయ్యింది.

తర్వాత సూర్య కీర్తి మాటలు పట్టించుకోకుండా ఫైమా ని టీ అడిగాడు. నేను చెప్పేది వినకుండా నీకు మధ్యలో టీ గుర్తుకు వచ్చిందా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ప్రోమో వైరల్ అయ్యింది. తర్వాత ఈ రోజు వరెస్ట్ కంటెండర్ గా ఎవరు జైలు కి వెళ్లాలో డిసైడ్ అయ్యాక బయట జైలు దగ్గర ఇనాయ-శ్రీహన్ లు గొడవ పెట్టుకున్నారు. కూర లేని కారణంగా అన్నం తినలేదు అని ఇనాయ అంటే.. నువ్వు ఫుడ్ వేస్ట్ చెయ్యడం నచ్చలేదు అని శ్రీహన్ అనగానే ఇనాయ నేను అందరికి చెబుతున్నా అంది.. దానితో శ్రీహన్ కాస్త ఫైర్ అయ్యి ఇది నా టైం నేను మాట్లాడాలి అన్నాడు. దానితో ఇనాయ మొహం మాడిపోయిన ప్రోమో కూడా వైరల్ అయ్యింది.

Bigg Boss 6: Today promos goes viral

bigg boss 6
bigg boss telugu
surya