Advertisementt

అల్లు అర్జున్ ఇంట అదిరిపోయే దివాళి పార్టీ

Mon 24th Oct 2022 10:52 AM
allu arjun,sneha reddy,allu arjun diwali bash  అల్లు అర్జున్ ఇంట అదిరిపోయే దివాళి పార్టీ
Allu Arjun, Sneha Reddy Dazzles At Their Diwali Party అల్లు అర్జున్ ఇంట అదిరిపోయే దివాళి పార్టీ
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో దివాళి సెలెబ్రేషన్స్ అనేది ఎప్పటినుండో వస్తున్న ఆచారం. అక్కడి సెలబ్రిటీస్ దివాళిని సెలెబ్రేట్ చేసుకోవడమే కాదు.. వారం ముందునుండే.. అదిరిపోయే పార్టీలు ఇచ్చి సెలబ్రిటీస్ ని ఆహ్వానిస్తారు. ఆ పార్టీలకి సెలబ్రిటీస్ సీతాకోక చిలుకల్లా రంగురంగుల డిజైనర్ వెర్స్ తో హాజరై ఫాన్స్ కి ట్రీట్ ఇస్తారు. ఇక కొన్నాళ్లుగా ఆ సాంప్రదాయం టాలీవుడ్ లోను మొదలయ్యింది. మెగా ఫ్యామిలిలో దివాళి సెలెబ్రేషన్స్ జరగడం కొన్నేళ్లుగా వింటున్నాం, చూస్తున్నాం. గత ఏడాది అల్లు అర్జున్ తన ఫామ్ హౌస్ లో మెగా ఫ్యామిలీ అందరితో కలిసి దివాళి పార్టీ ఇచ్చారు.

అదే ఈ ఏడాది కూడా అల్లు అర్జున్ గత రాత్రే అంటే ఆదివారం రాత్రే తన ఇంట్లో దివాళి సెలెబ్రేషన్స్ చేసేసారు. అల్లు అర్జున్, స్నేహ రెడ్డి లు హోస్ట్ లుగా ఈ పార్టీ అంగరంగ వైభవంగా జరిగినట్టుగా కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దిల్ రాజు కూతురు ఇంకొంతమంది ఈ పార్టీకి హాజరవగా.. అల్లు ఫ్యామిలీ మొత్తం ఈ పార్టీలో దర్శనమిచ్చినా.. మెగా ఫ్యామిలోని చిరు, రామ్ చరణ్, వరుణ్, సాయి తేజ్ లాంటి వారు ఈ పార్టీలో కనిపించలేదో.. లేదంటే వాళ్ళ పిక్స్ బయటికి రాలేదో కానీ.. ప్రస్తుతం, అల్లు అర్జున్ దివాళీ పార్టీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచింది.

Allu Arjun, Sneha Reddy Dazzles At Their Diwali Party:

Allu Arjun Diwali Bash

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ