బిగ్ బాస్ 6: ఓటింగ్ లో భారీ ట్విస్ట్ లు
Bigg Boss 6: Huge twists in votingబిగ్ బాస్ సీజన్6 ఏడో వారం ఇంటి నుండి బయటికి వెళ్లబోయే కంటెస్టెంట్ పై రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా మరీనా-రాజ్, మరీనా-శ్రీ సత్యల మధ్యనే వీక్ ఓటింగ్ కనిపించింది. గత గురువారం వరకు మరీనా లీస్ట్ లో ఉండగా.. శుక్రవారం ఓటింగ్ ముగిసే సమయానికి బోలెడన్ని ట్విస్ట్ లు కనిపించాయి. కంటెస్టెంట్స్ ఆటతీరుతో రోజూ ఓటింగ్స్ సరళిలో పెను మార్పులు కనిపించాయి. ఒకరోజు రాజ్ మరీనా కన్నా బెటర్ గా ఉంటే.. మరో రోజు మరీనా కన్నా శ్రీ సత్య బెటర్ ప్లేస్ లోకి రావడం, రాజ్ మెరుగుపడడం ఇలా.
కానీ శుక్రవారం ఓటింగ్ పోల్స్ ముగిసే సమయానికి అనూహ్యంగా వాసంతి లీస్ట్ లోకి వచ్చేసింది. వసంతికన్నా కొద్దిగా బెటర్ ప్లేస్ లో ఇనాయ ఉంది. మొదట్లో మూడు వారాల పాటు శ్రీహన్ తో గొడవలతో బాగా హైలెట్ అయిన ఇనాయ నామినేషన్స్ లోకి వచ్చిన ప్రతిసారి సేవ్ అవుతూ.. ఓటింగ్ విషయంలో నాలుగైదు స్థానాల్లో కొనసాగినా.. ఈవారం ఓటింగ్ ముసిగేసమయానికి చివరి రెండు స్థానాలకు పడిపోయింది. ఇక హౌస్ లో వాసంతి నేనే వీక్ అంటున్నారనడమే కాదు, బుల్లితెర ప్రేక్షకులు ఆమెని పంపెయ్యడానికి డిసైడ్ అయినట్లుగా కనబడుతుంది. అయితే ఈ వారం వాసంతి-ఇనాయ ఎవరో ఒకరు కాదు, ఈ ఇద్దరూ డబుల్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది అంటూ ప్రచారమైతే జోరుగా సాగుతుంది.
Bigg Boss 6: Finally Vasanti-Inaya in danger zone







































