చిరు-బాలయ్య టైటిల్స్ లో కామన్ పాయింట్

Fri 21st Oct 2022 01:12 PM
chiranjeevi,balakrishna,veera title  చిరు-బాలయ్య టైటిల్స్ లో కామన్ పాయింట్
Common point in Chiru-Balayya titles చిరు-బాలయ్య టైటిల్స్ లో కామన్ పాయింట్
Advertisement
Ads by CJ

సీనియర్ హీరోలు చిరంజీవి-బాలకృష్ణలు ఇప్పుడు పోటీకి దిగుతున్నారు. సంక్రాంతికి ఈ హీరోలిద్దరి మధ్యన బిగ్ ఫైట్ ఉంటుంది అనే ప్రచారంతో పాటుగా.. దివాళికి టైటిల్స్ విషయంలోనూ ఈ హీరోలిద్దరూ పోటీ పడుతున్నారు. ఈరోజు బాలకృష్ణ NBK107 టైటిల్ ని కర్నూల్ వేదికగా రివీల్ చెయ్యబోతున్నారు. అయితే బాలకృష్ణ NBK107 టైటిల్ గా వీర సింహ రెడ్డి అనే టైటిల్ పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. వీర సింహ రెడ్డి పాత్రలో బాలయ్య పవర్ ఫుల్ యాక్షన్, అలాగే పవర్ ఫుల్ డైలాగ్స్ అన్ని హైలైట్ గా నిలవబోతున్నాయని తెలుస్తుంది.

మరోపక్క చిరంజీవి మెగా 154 టైటిల్ కూడా దివాళి స్పెషల్ గా సోమవారం అక్టోబర్ 24 ఉదయం రిలీజ్ చెయ్యబోతున్నారు. మెగా 154 కి మొదటి నుండి వాల్తేర్ వీరయ్య టైటిల్ ప్రచారంలో ఉండగా.. ఫైనల్ గా అదే టైటిల్ పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి బాలయ్య-చిరు నువ్వా - నేనా అని పోటీ పడుతుంటే.. ఇప్పుడు టైటిల్ లో ఓ కామన్ పాయింట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అది చిరు వాల్తేర్ వీరయ్యలో వీర, బాలయ్య వీర సింహ రెడ్డి లో వీర కామన్ పాయింట్ గా ఉండడం, అది సీనియర్ హీరోల టైటిల్ లో కామన్ పాయింట్ గా రావడం, విడుదల తేదీ కూడా ఒకే రోజు అయితే వీర అనే టైటిల్ విషయంలో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ కూడా అయ్యే అవకాశం ఉంది.

Common point in Chiru-Balayya titles:

Chiranjeevi And Balakrishna Running After Veera Only 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ