Advertisementt

బిగ్ బాస్: అందరూ రేవంత్ నే టార్గెట్ చేసారు

Mon 17th Oct 2022 06:47 PM
bigg boss 6,bigg boss telugu,revanth  బిగ్ బాస్: అందరూ రేవంత్ నే టార్గెట్ చేసారు
Bigg Boss 6: Everyone has targeted Revanth బిగ్ బాస్: అందరూ రేవంత్ నే టార్గెట్ చేసారు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 ఐదో కెప్టెన్ గా రేవంత్ సూపర్ అంటూ హౌస్ లో నాగ్ ముందు చెప్పిన కంటెస్టెంట్స్ ఈ రోజు నామినేషన్స్ కి వచ్చేసరికి.. నువ్వు కెప్టెన్ అయ్యి ఎక్కువగా నిద్ర పోయావ్. కెప్టెన్ అయ్యి హౌస్ ని బాగా చూసుకోవాల్సిన నువ్వే.. ఇలా నిద్రపోతే ఎలా అంటూ రేవంత్ ను కుర్చీలో కూర్చో బెట్టి మరీ బురద నీళ్లు పోసి నామినేట్ చేసారు. రోహిత్, బాలాదిత్య, మరీనా ఇలా చాలామంది నామినేట్ చేసేసరికి.. రేవంత్ కాస్త కోపంతో మీ దగ్గర వేరే రీజన్స్ ఏమి లేక ఇలాంటి చెత్తరీజన్ తో నామినేట్ చేసారంటూ బురదపడే చోట కూర్చుకున్నాడు. ఎప్పటిలాగే శ్రీహన్-ఇనాయ మధ్యన నామినేషన్స్ గొడవ జరిగింది.

ఆదిరెడ్డి వచ్చి వాసంతి నామినేషన్స్ కి భయపడుతుంది అంటూ ఆమెని నామినేట్ చెయ్యగా.. వాసంతి ఒప్పుకోలేదు. మీ మీద నేనే అట బాగా ఆడుతున్నా అంటూ అది రెడ్డి చెప్పాడు. అర్జున్ కి అది రెడ్డికి నామినేషన్స్ గొడవ జరిగింది. మీరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు అని అర్జున్ అంటే.. మీరు ఇవ్వలేదు అంటూ ఆదిరెడ్డి ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత గీతూ ఆదిత్యను నామినేట్ చేస్తూ నువ్వు మంచిగా ఎలా ఉన్నావో అలానే మంచిగా హౌస్ నుండి వెళ్ళిపోతే బాగుంటుంది అంది. అసలు నీకు బిగ్ బాస్ అనేది కరెక్ట్ కాదు అని నాకు పర్సనల్ గా అనిపిస్తుంది అని గీతు  చెప్పడంతో ఆదిత్య నీకు సమాధానం చెప్పాలని కూడా లేదు అని.. చాలా క్లారిటీ వచ్చింది. నాకు ఒక విషయం అర్థమైంది అంటూ ఏ హౌస్ గురించి నేను మంచి కోసం ఆలోచిస్తున్నానో.. అదే హౌస్ నా గురించి ఇలా ఆలోచిస్తున్నారని ఆ రోజు నాగర్జున గారు నాకు లోపల వీడియో చూపించారు. అప్పుడు నాకు క్లారిటీ రాలేదు.. కానీ ఇప్పుడు మాత్రం చాలా క్లారిటీ వచ్చింది అంటూ బురదలో కూర్చున్నాడు. ఇక ఈ వారం సూర్య-గీతు తప్ప హౌస్ లో ఉన్న 13 మంది నామినేట్ అయినట్లుగా బిగ్ బాస్ లీకులు చెబుతున్నాయి. 

Bigg Boss 6: Everyone has targeted Revanth:

Bigg Boss 6 latest promo viral

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ