Advertisement

విజయ్ తో రిలేషన్ పై రష్మిక రియాక్షన్

Sat 01st Oct 2022 08:52 PM
rashmika mandanna,vijay deverakonda,liger movie  విజయ్ తో రిలేషన్ పై రష్మిక రియాక్షన్
Rashmika Mandanna reacts to Vijay Deverakonda dating rumours విజయ్ తో రిలేషన్ పై రష్మిక రియాక్షన్
Advertisement

పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన లైగర్ ఎంత పెద్ద డిజాస్టరో అందరికి తెలిసిందే. పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీ ఆ అంచనాలు అందుకోవడంలో ఫెయిల్ అయ్యింది. సౌత్ లో డిసాస్టర్ అయిన లైగర్ హిందీలో ప్లాప్ అయ్యింది. దానితో పూరి అండ్ విజయ్ కూడా చాలా డిస్పాయింట్ అయ్యారు. కాని లైగర్ సినిమా చూస్తూ విజిల్స్ వేస్తూ డాన్స్ చేశాను అని చెబుతుంది విజయ్ దేవరకొండ బెస్ట్ ఫ్రెండ్ రష్మిక మందన్న. గీత గోవిందం తర్వాత మరో సినిమా కలిసి చేసిన రష్మిక- విజయ్ లపై చాలా రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. వీరి మధ్యన సం థింగ్ సం థింగ్ అంటునప్పటికీ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెబుతారు వీళ్ళు.

ప్రస్తుతం బాలీవుడ్ లో గుడ్ బాయ్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రశ్మికకి విజయ్ ఫ్రెండ్ షిప్ పై ప్రశ్నలతో పాటు లైగర్ మూవీ పై కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి రష్మిక స్పందిస్తూ విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం, డియర్ కామ్రెడ్ చేశాను. దానితో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అప్పటినుండి అందరూ రష్మిక-విజయ్ దేవర కొండ అంటూ మా రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతున్నారు. నాకు చాలా హ్యాపీ గా ఉంది అంటూ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడింది. అంతేకాకుండా విజయ్ దేవరకొండ లైగర్ మూవీ నచ్చిందా.. అని అడగ్గానే లైగర్ మూవీ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. మాస్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. సినిమా చూస్తున్నంత సేపు విజిల్స్ వేస్తూ, డ్యాన్స్ కూడా చేశాను. లైగర్ సినిమా ఫలితం ఎలా ఉన్నా నాకు మాత్రం బాగా నచ్చింది. నటనతో విజయ్ అదరగొట్టేశాడు. ఫిట్ నెస్ పై విజయ్ ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. వెల్ డన్ విజయ్ అంటూ ఒకటే పొగడ్తలు.

Rashmika Mandanna reacts to Vijay Deverakonda dating rumours:

Rashmika Mandanna calls Vijay Deverakonda dating rumours cute

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement