పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలనుండి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వకీల్ సాబ్, భీమ్లా నాయక్ మూవీస్ చేసి హిట్ కొట్టారు. సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఒకదానిలో లాయర్ గాను, ఒకదానిలో పోలీస్ ఆఫీసర్ గాను నటించారు. ఆ పాత్రల్లో లుక్ విషయంలో పెద్ద వేరియేషన్ చూపించలేదు. ఒకటే హెయిర్ స్టయిల్ మెయింటింగ్ చేసారు. అయితే హరి హర వీరమల్లు కోసం పవన్ కళ్యాణ్ యుద్ధ విద్యలు అంటే కత్తిసాము, కర్రసాము లాంటివి నేర్చుకున్నారు. హరి హర వీరమల్లు విషయంలో పవన్ లుక్ కొత్తగానే కనిపిస్తుంది. పొలిటికల్ గా బిజీగా ఉంటున్న పవన్ కి ఫిజిక్ మెయింటింగ్ చెయ్యడం కష్టం గానే మారింది. పవన్ కళ్యాణ్ ఈమధ్యనే ఒక వారం పాటు అబ్రాడ్ ట్రిప్ వేసి హైదరాబాద్ కి వచ్చారు.
ఈ రోజు శుక్రవారం ఉదయం జనసేన ఆఫీసులో పవన్ కళ్యాణ్ పూజలు నిర్వహించారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సూపర్ ఫిట్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తో పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు వర్క్ షాప్ లో పాల్గొన్న పిక్స్ అవి. ఆ పిక్స్ లో పవన్ మొహం లో ఎలాంటి కొత్తదనం లేకపోయినా.. ఆయన బాడీ మాత్రం ఫిట్ గా కనిపిస్తుంది. సూపర్ ఫిట్ పవన్ అన్నా.. ఇదే పవన్ న్యూ లుక్ అంటూ పవన్ ఫాన్స్ సంబరపడిపోతున్నారు. అక్టోబర్ నుండి పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటారని తెలుస్తుంది.




సినీజోష్ రివ్యూ : PS-1 (పొన్నియన్ సెల్వన్ 1)
Loading..