Advertisementt

శివాజీ రాజాకి వార్నింగ్ ఇచ్చిన పవన్

Tue 27th Sep 2022 01:47 PM
pawan kalyan,shivaji raja,maa president  శివాజీ రాజాకి వార్నింగ్ ఇచ్చిన పవన్
Pawan gave a warning to Shivaji Raja శివాజీ రాజాకి వార్నింగ్ ఇచ్చిన పవన్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమా షూటింగ్స్ తో చాలా బిజీగా వుంటున్నారు. పొలిటికల్ గా పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడమే కాదు, సినిమాల్లోనూ అదిరిపోయే డైలాగ్స్ చెప్పే పవన్ కళ్యాణ్ శివాజీ రాజాని మరోసారి మా అధ్యక్షుడిగా ఉండనివ్వను అంటూ వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని శివాజీ రాజా రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టడం హాట్ టాపిక్ గా మారింది. శివాజీని రాజా మా అధ్యక్షుడిగా కొనసాగుతున్న టైం లోనే నటి శ్రీరెడ్డి మా ఆఫీస్ ముందు చేసిన రచ్చ విషయంలో పవన్ కళ్యాణ్ రంగం లోకి దిగిన విషయాన్ని సదరు యూట్యూబ్ ఛానల్ యాంకర్ ప్రశ్నించగా.. శివాజీ రాజా ఆ విషయాన్ని ఒప్పుకోవడమే కాదు.. చాలా విషయాలను బయటపెట్టాడు.

శ్రీరెడ్డి ఇష్యూ టైం లో నేను మా అధ్యక్షుడిగా ఉన్నాను. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా ఆఫీస్ కి వచ్చారు. అప్పుడు నేను నాగ శౌర్య నర్తనశాల షూటింగ్ లో ఉన్నాను. ఇంతలో పవన్ పిలిపించారనగానే నేను మా ఆఫీస్ కి వచ్చాను. శ్రీరెడ్డి పై నేను మా తరుపున కోర్టులో కేసు వేయలేదనుకున్నారు. నేను అక్కడికి వెళ్లే సమయానికి పవన్ చాలా కోపంగా ఉన్నారు. అంత కోపం ఆయనలో నేను ఎప్పుడూ చూడలేదు. జరిగింది మొత్తం చెబుతున్నా పవన్ మాత్రం కోపంగా స్తంభం పట్టుకుని అటు ఇటు తిరుగుతూ.. నెక్స్ట్ నిన్ను ప్రెసిడెంట్ గా ఉంచను అంటూ వార్నింగ్ ఇచ్చారు. శ్రీరెడ్డి పై నేను తీసుకున్న యాక్షన్ పేపర్ ని పవన్ కి చూపించాను. ఛాంబర్ లో ఉన్న లాయర్ ఉన్నారు ఇవ్వమని చెప్పారు. నేను లోపలి వెళ్లేసరికి ఛాంబర్ రూమ్ మొత్తం కోర్టు రూమ్ లా కనిపించింది. అక్కడ ఒక్క జెడ్జ్ తప్పితే మొత్తం కోర్టులా ఉంది. అంతమంది లాయర్లు ఉన్నారు. నా మిత్రుడైన పవన్ ని అలా కోపంగా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు అంటూ ఆనాటి విషయాలను శివాజీ రాజా ఈనాడు బయటపెట్టారు.

Pawan gave a warning to Shivaji Raja:

Why Pawan Kalyan Given Warning To Shivaji Raja

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ