Advertisement

ఆదిపురుష్ అప్ డేట్ పై ప్రభాస్ ఫాన్స్ హ్యాపీ

Tue 27th Sep 2022 12:12 PM
adipurush,adipurush teaser,prabhas  ఆదిపురుష్ అప్ డేట్ పై ప్రభాస్ ఫాన్స్ హ్యాపీ
Adipurush teaser on ఆదిపురుష్ అప్ డేట్ పై ప్రభాస్ ఫాన్స్ హ్యాపీ
Advertisement

ఎన్నో రోజులుగా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫాన్స్ కి ఊరటనిచ్చే కాదు, ఊపిరిపీల్చుకునే న్యూస్ వచ్చేసింది. ప్రభాస్-ఓం రౌత్ ల ఆదిపురుష్ అప్ డేట్ వచ్చేస్తుంది. దసరా నవరాత్రుల రోజుల్లో ఆదిపురుష్ టీజర్‌ను అక్టోబర్ 2, 2022న అయోధ్యలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్ కి ప్రభాస్ తో పాటుగా హీరోయిన్ కృతి సనన్, రావణ్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్, దర్శకుడు ఓం రౌత్ అలాగే మరికొంతమంది టీం కూడా హాజరవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఆదిపురుష్ టీజర్ తో పాటుగా ప్రభాస్ లుక్ కూడా ఈ ఈవెంట్ లో లాంచ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

చాలారోజులుగా ఆదిపురుష్ అప్ డేట్ అంటూ ఫాన్స్ ఆరాటపడుతున్నా మేకర్స్ మౌనం వహిస్తూ ఉండడం, ప్రభాస్ ఫ్యాన్ మెడ్ పోస్టర్స్ ని ఓం రౌత్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడం అన్ని ప్రభాస్ ఫాన్స్ కి చాలా కోపాన్ని తెప్పించాయి. ఇక ప్రభాస్ బర్త్ డే వరకు ఆదిపురుష్ అప్ డేట్ ఉండదని చాలామంది ఫాన్స్ డిస్పాయింట్ కూడా అయ్యారు. ఇప్పుడు ఓం రౌత్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి Our magical journey is now yours to experience & love! ✨ 

The much awaited #AdipurushTeaser and the first poster of our film will be launched on Oct. 2! 

Venue - Bank Of Sarayu, Ayodhya, UP! 

#Adipurush releases IN CINEMAS on January 12, 2023 in IMAX & 3D! అంటూ అఫీషియల్ ప్రకటనతో ప్రభాస్ ఫాన్స్ ఆదిపురుష్ హాష్ టాగ్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేసేస్తున్నారు. 

Adipurush teaser on :

Adipurush teaser on OCT 2nd

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement