Advertisementt

సల్మాన్, పూరి పై చిరు కామెంట్స్

Sat 24th Sep 2022 10:29 AM
chiranjeevi,srimukhi,godfather movie  సల్మాన్, పూరి పై చిరు కామెంట్స్
In The Clouds With God Father Interview Promo సల్మాన్, పూరి పై చిరు కామెంట్స్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో మొదలైపోయాయి. అక్టోబర్ 5 దసరా స్పెషల్ గా విడుదల కాబోతున్న గాడ్ ఫాదర్ మూవీ పై ట్రేడ్ లోను భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. చిరు తో సల్మాన్ ఖాన్ కలిసి నటించడం, నయనతార ఇంట్రెస్టింగ్ కేరెక్టర్ చెయ్యడంతో సినిమాపై భారీ హైప్ నెలకొంది. అయితే తాజాగా శ్రీముఖితో ఫ్లైట్ లో మేఘాల్లో ఇంటర్వ్యూ అంటూ చిరంజీవి గాడ్ ఫాదర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. శ్రీముఖి ఆ ప్రోమోలో మీరు చెప్పిన ఓ డైలాగ్ పొలిటికల్ గా బాగా పేలింది.. చాలా హాట్ హాట్ గా మారింది అని అడిగింది.

రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను. కానీ రాజ‌కీయం నా నుంచి దూరం కాలేదు.. అంటూ చిరు మరోసారి ఆ డైలాగ్ తో అదరగొట్టేసారు. ఇక సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ లో కేరెక్టర్ ని చాలా ప్రేమతో చేసాడని, హ్యాట్సాఫ్ టు సల్మాన్ భాయ్ అన్నారు చిరు. ఇక జర్నలిస్ట్ గా పూరి జగన్నాధ్ ఈ కేరెక్టర్ ఛస్తే చెయ్యను అన్నాడు. పూరీలోని కమాండింగ్ ఉన్న నటుడు ఉన్నాడని చూసిన తరువాత మీరే ఆశ్చర్యపోతారు అంటూ చిరు ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. ఇక ఎస్ఎస్ థమన్ ఆరో ప్రాణం. ఒక్క మాటలో చెప్పాలంటే గాడ్ ఫాదర్ నిశ్శబ్ద విస్పోటనం అంటూ థమన్ ఫై క్రేజీగా స్పందించారు చిరు.

In The Clouds With God Father Interview Promo:

Chiranjeevi interview Srimukhi Godfather movie

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ