Advertisement

ప్రేమపై ఓపెన్ అయిన అమీర్ కూతురు

Fri 23rd Sep 2022 12:43 PM
aamir khan,nupur shikhare,ira khan  ప్రేమపై ఓపెన్ అయిన అమీర్ కూతురు
Aamir Khan Daughter, Ira Khan Gets Engaged ప్రేమపై ఓపెన్ అయిన అమీర్ కూతురు
Advertisement

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా తో డిసాస్టర్ చవి చూసారు. లాల్ సింగ్ చద్దా ప్లాప్ అవడంతో.. ఆ సినిమాకి నష్టపోయిన బయ్యర్లకి అమీర్ ఖాన్ చాలావరకు లెక్కలు సెటిల్ చేసినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. అదలా ఉంటే.. అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ ఎప్పటినుండో ప్రేమలో ఉంది అని, అమీర్ ఖాన్ పర్సనల్ ఫిట్ నెస్ ట్రైనర్ తో డేటింగ్ లో ఉంది అని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తాజాగా ఐరా ఖాన్ ఆమె  ప్రేమని అందరి ముందు ఓపెన్ గానే చెప్పేసింది.

ఐరా ఖాన్ ప్రేమించిన ఫిట్ నెస్ ట్రైనర్ నుపుర్ ఈ మధ్యన సైక్లింగ్ పోటీల కోసం విదేశాలకు వెళ్లడంతో.. అతనితో పాటుగా ఐరా కూడా వెళ్ళింది. అక్కడ సైక్లింగ్ పోటీ ముగియగానే నుపుర్ వచ్చి ఐరా ని హగ్ చేసుకుని మోకాళ్లపై కూర్చుని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగగానే.. ఐరా ఎస్ అని చెప్పడమే కాదు.. అక్కడే ఉంగరం తొడిగించుకుని మరీ ఎంగేజ్మెంట్ తో.. తమ ప్రేమని ప్రపంచానికి బహిర్గతం చేసారు. దానితో బాలీవుడ్ సెలబ్రిటీస్ ఐరా కి సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు.

Aamir Khan Daughter, Ira Khan Gets Engaged:

Aamir Khan daughter Ira engaged to beau Nupur Shikhare

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement