ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Huge Loss to Sudheer Babu with Aa Ammayi Gurinchi Meeku Cheppali

ఆ అమ్మాయితో ఆగమాగమైండు!

ఏ అమ్మాయిని నమ్ముకుని? అసలు ఆగమైంది ఎవరు? అని అనుకుంటున్నారా? ఆగమైన అబ్బాయి నెట్రోస్టార్ సుధీర్ బాబు. ఆగం చేసిన ఆ అమ్మాయి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అర్థం కాలేదా.. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో నటించిన కృతిశెట్టి. ఈ భామకి ‘ఉప్పెన’ తప్ప.. ఈ మధ్యకాలంలో విడుదలైన ఏ ఒక్క సినిమా కూడా హిట్ పడలేదు. ఇప్పుడామె పాత్రనే బేస్ చేసుకుని టాలెంటెడ్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఓ సినిమా చేశాడు. ఆ సినిమా పేరే.. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ సినిమా రీసెంట్‌గా విడుదలై, ఎటువంటి టాక్‌ని సొంతం చేసుకుందో తెలిసిందే. మొదటి రోజు, మొదటి ఆట నుండే ఇది థియేటర్ సినిమా కాదు.. ఓటీటీ సినిమా అనేలా విశ్లేషకులు, విమర్శకులు తేల్చేశారు. అయితే ఈ సినిమాతో హీరో సుధీర్ బాబు కూడా బాగా నష్టపోయినట్లుగా తెలుస్తుంది. 

 

మైత్రీ మూవీ మేకర్స్‌తో బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రానికి బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి నిర్మాతలు. వీరితో పాటు హీరో సుధీర్ బాబు కూడా ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఆయన కూడా కొంత మేర పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తుంది. మోహనకృష్ణ ఇంద్రగంటిపై ఉన్న నమ్మకంతో బడ్జెట్‌లో మేజర్ పార్ట్ సుధీర్‌ బాబుదే అని టాక్. సుమారు 6 కోట్ల వరకు ఈ సినిమాకు బడ్జెట్ అయిందని, అందులో 10 శాతం కూడా వెనక్కి తిరిగిరాలేదని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తున్న టాక్. ఇంకా ఈ చిత్రానికి శాటిలైట్ బిజినెస్ కూడా జరగలేదని తెలుస్తుంది. అదేమైనా పూర్తయితే మాత్రమే.. నిర్మాతలు కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది.. లేదంటే ఈ అమ్మాయితో వారు ఆగమాగమైనట్లేనని.. ఇండస్ట్రీ పీపుల్ అనుకుంటున్నారు.

Aa Ammayi Gurinchi Meeku Cheppali Final Result at Box Office

Huge Loss to Sudheer Babu with Aa Ammayi Gurinchi Meeku Cheppali
aa ammayi gurinchi meeku cheppali
sudheer babu
huge loss
krithi shetty
mohankrishna indraganti