Advertisementt

ప్రభాస్ కి ఫోన్ చేసి మాట్లాడిన ప్రధాని మోదీ

Sun 18th Sep 2022 08:55 PM
pm modi,prabhas,krishnam raju  ప్రభాస్ కి ఫోన్ చేసి మాట్లాడిన ప్రధాని మోదీ
Prime Minister Modi calls Prabhas ప్రభాస్ కి ఫోన్ చేసి మాట్లాడిన ప్రధాని మోదీ
Advertisement
Ads by CJ

బీజేపీ నేత, నటుడు కృష్ణం రాజు మరణించడం అటు ఆయన ఫ్యామిలీకి, బీజేపీ పార్టీకి, ఇటు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన మరణం తర్వాత బీజేపీ కీలక నేతలు, కేంద్ర మంత్రులు కృష్ణం రాజు ఇంటికి వెళ్లి ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ ముఖ్యంగా ప్రభాస్ ని పరామర్శించి వస్తున్నారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, కిషన్ రెడ్డి కృష్ణం రాజు నివాసానికి వెళ్లి పరామర్శించడమే కాదు, కృష్ణం రాజు సంతాప సభకి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. కృష్ణం రాజు మరణించిన రోజు సోషల్ మీడియా ద్వారా ప్రధాని మోదీ ఆయన ఫ్యామిలీకి సంతాపం తెలియజేసారు.

తాజాగా ప్రభాస్ కి ప్రధాని మోదీ ఫోన్ లో పరామర్శించినట్టుగా తెలుస్తుంది. కృష్ణం రాజు మరణం పార్టీకి తీరని లోటు అని, ఆయన కుటుంబానికి ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతిని తెలియజేసినట్లుగా తెలుస్తుంది. గతంలో కృష్ణం రాజు ఆయన భార్య శ్యామల దేవి తో పాటుగా ప్రభాస్ ప్రధాని మోదీ ని కలిసిన సందర్భం కూడా ఉంది. అలాగే బాహుబలి సక్సెస్ అయ్యాక ప్రధాని మోదీ ప్రభాస్ ని ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పుడు పెదనాన్న మరణంతో బాధపడుతున్న ప్రభాస్ ని మోదీ పర్సనల్ గా ఫోన్ లో పరామర్శించారు.

Prime Minister Modi calls Prabhas:

PM Modi visited Prabhas on phone

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ