Advertisementt

బిగ్ బాస్ 6: సర్ ప్రైజ్ ఎలిమినేషన్

Sat 17th Sep 2022 10:10 PM
bigg boss 6,shaani,nagarjuna  బిగ్ బాస్ 6: సర్ ప్రైజ్ ఎలిమినేషన్
Bigg Boss Telugu 6: This contestant eliminated బిగ్ బాస్ 6: సర్ ప్రైజ్ ఎలిమినేషన్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 రెండు వారాల్లో ఎన్నో రకాలుగా ఎన్నో జరిగిపోయాయి. ఈ రెండు వారాల్లో కంటెస్టెంట్స్ ఏమేమి చేసారో.. ఎలా గేమ్ ఆడారో.. ఏ గేమ్ ఆడలేదు అన్న రేంజ్ లో శనివారం అంటే ఈ రోజు ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ని గడగడలాడించారు. కేవలం తొమ్మిదిమంది బాలాదిత్య, షాని, అభినయ, సుదీప, శ్రీ సత్య, కీర్తి, వాసంతి, మరీనా-రోహిత్, శ్రీహన్.. నే కాదు బాగా ఆడిన రేవంత్ దగ్గరనుండి గలాటా గీతూ, ఫైమా, సూర్య, చంటి, అర్జున్, ఆది రెడ్డి ఇలా ఎవ్వరిని వదలకుండా అందరిని రెవెట్టేసారు నాగ్. మీరు మారండి, గేమ్ ఆడండి అంటూ చిన్న పిల్లలకి క్లాస్ పీకినట్టుగా క్లాస్ పీకిన నాగార్జున.. తర్వాత అస్సలు ఆడని వారికి బిగ్ షాక్ ఇచ్చారు. మీ తొమ్మిదిమంది ఆట హౌస్ లో అస్సలు కనిపించడం లేదు.. మీకు ఇంట్లో ఉండాలని ఉందా.. లేదా అంటూ ఫైర్ అవడమే కాదు, ఆ తొమ్మిదిమంది హౌస్ మేట్స్ కుండలు పగలగొట్టి షాకిచ్చారు. అంతేకాదు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ నాగార్జున ఆ తొమ్మిదిమందిని ఒణికించారు. సూట్ కేస్ లు ప్యాక్ చేయించారు.

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని, ఈ తొమ్మిదిమంది లో ఎవరు వరెస్ట్ గా ఆడారో అని మిగతా హౌస్ మేట్స్ వారి మొహం మీద స్టాంప్ వెయ్యమని చెప్పగా.. హౌస్ మేట్స్ లోని చాలామంది శ్రీ సత్య-షాని-వాసంతి ఫేస్ మీద స్టాంప్స్ వేశారు. అలా ముగ్గురు డేంజర్ జోన్ లోకి వచ్చారు. అయితే ఫైనల్ గా ఈ రోజు శనివారం ఎపిసోడ్ లో డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా సై నటుడు షాని ని ఎలాంటి హడావిడి లేకుండా నాగార్జున ఎలిమినేట్ చెయ్యగా.. మరిన్ని వరెస్ట్ ఓట్స్ పడిన శ్రీ సత్యని జైలుకి పంపారు నాగ్. ఇక ఈ ఎపిసోడ్ కి గెస్ట్ గా నాగ్ వైఫ్ అమల, ఒకే ఒక జీవితం తో హిట్ కొట్టిన శర్వానంద్ వచ్చారు.

Bigg Boss Telugu 6: This contestant eliminated:

Bigg Boss 6: Shaani get evicted

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ