లైగర్ కి అంత సెటిల్ చేసారా?
Settlements start with Liger lossesవిజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ గా పరిచయమయిన లైగర్ మూవీ విజయ్ దేవరకొండకి ఎప్పటికి మరిచిపోలేని డిసాస్టర్ అందించింది. లైగర్ ముందు ఆ సినిమా పక్కా హిట్ అంటూ విజయ్ దేవరకొండ చేసిన ప్రమోషన్స్ వృధా అయ్యాయి. పూరి-ఛార్మి నిండా మునిగిపోయారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ తట్టుకోలేక దాని నుండి తప్పుకున్నారు. మరి పూరి-ఛార్మి సోషల్ మీడియా నుండి తప్పుకుని బాధపడినా లైగర్ ని కొని నష్టపోయిన బయ్యర్లు ఊరుకోరు కదా.. అదే లైగర్ నష్టాలు పూడ్చమని వాళ్లపై ఒత్తిడి తెస్తున్నారట. మధ్యలో ఛార్మి మేమేం చేయలేమని చెప్పినా వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు.. పూరి కనెక్ట్స్ ఆఫీస్ చుట్టూ తిరగడం స్టార్ట్ చెయ్యడంతో పూరి-ఛార్మీలు దారికొచ్చి ఇప్పుడొక నిర్ణయానికి వచ్చారట.
దానిలో భాగంగానే కొంతమొత్తాన్ని బయ్యర్లకి సర్దడానికి ఒప్పుకున్నారట. ఆంధ్రాకు 6 కోట్లు, నైజాం 4.5 కోట్లు, సీడెడ్ 2.25 కోట్లు వెనక్కు ఇవ్వడానికి పూరి అండ్ ఛార్మి లు అంగీకరించారట. గతంలోలా సినిమా పోయినా.. మరో సినిమా చేసి మీకే ఇస్తాం అంటే బయ్యర్లు ఒప్పుకోవడం లేదు. అప్పటి మర్కెట్ అప్పటిది.. ఇప్పుడు సెటిల్ చెయ్యమని డైరెక్ట్ గానే అడుగుతున్నారు. మరి మెగాస్టార్ లాంటి వాళ్ళకే ఈ తిప్పలు తప్పలేదు.. విజయ్ దేవరకొండ - పూరి వీళ్లకో లెక్కా.
Director puri Jagannath discussion on Liger movie losses settlements







































