Advertisementt

బిగ్ బాస్ 6: ఆ హౌస్ మేట్స్ పై నాగ్ సీరియస్

Sat 17th Sep 2022 06:37 PM
bigg boss 6,bigg boss,nagarjuna  బిగ్ బాస్ 6: ఆ హౌస్ మేట్స్ పై నాగ్ సీరియస్
Bigg Boss 6: The Nagarjuna on those housemates is serious బిగ్ బాస్ 6: ఆ హౌస్ మేట్స్ పై నాగ్ సీరియస్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 రెండు వారాలకే రసవత్తరంగా మారింది. పేరు లేని, మొహాలు తెలియని వారే అయినా.. తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలనే తపన ఆ 21 మందిలో కాకపోయినా ఎంతో కొంతమందిలో ఉంది. అదే ఈ రోజు ఎపిసోడ్ లో నాగార్జున చెప్పారు. నాగార్జున రావడం, రావడమే తొమ్మిదిమంది హౌస్ మేట్స్ పేర్లు చెప్పి మరీ మీ ఆట హౌస్ లో అస్సలు కనిపించడం లేదు.. మీకు ఇంట్లో ఉండాలని ఉందా.. లేదా అంటూ ఫైర్ అవడమే కాదు, ఆ తొమ్మిదిమంది హౌస్ మేట్స్ కుండలు పగలగొట్టి షాకిచ్చారు. అంతేకాదు.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ మరింతగా ఒణికించేశారు.

బాలాదిత్య, షాని, అభినయ, సుదీప, శ్రీ సత్య, కీర్తి, వాసంతి, మరీనా-రోహిత్, శ్రీహన్.. మై డియర్ నైన్.. మీరు బిగ్ బాస్ కి వచ్చింది ఆడడానికి కాదు, ఛిల్ అవడానికి వచ్చారంటూ కుండలు పగలు గొట్టిన నాగార్జున.. తినడానికి పండడానికి ఇంట్లోకి వచ్చామంటే బాగ్స్ సర్దుకుని వెళ్లిపోండి.. అంటూ షాకిచ్చారు. బాలాదిత్య నీ ఆట కాదు, నువ్వు అందరి ఆటని చెడగొడుతున్నావ్ అన్నారు నాగ్. శ్రీ సత్య నీ కుండ పగిలినందుకు ఫీలయ్యావా.. అంటే లేదు అంది. అదే నీ ప్లేట్ లాగేసుకుంటే ఫీల్ అయ్యేదానికి. ఇక అభినయ నన్ను జీరో పెరఫార్మెన్స్ అంటే ఒప్పుకోను అంది. కనీసం 10 పర్సెంట్ అయినా ఆడవా అంటూ క్లాస్ పీకారు. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని, మీలో ముగ్గురు నామినేషన్స్ లో ఉన్నారు. మిగతా ఆరుగురు అందరూ మీ లగేజ్ ప్యాక్ చేసుకోండి.. మీరు ఈ రోజు ఆటలో ఆడరు అంటూ నాగార్జున హౌస్ మేట్స్ కి బిగ్ షాక్ ఇచ్చిన ప్రోమో నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Bigg Boss 6: The Nagarjuna on those housemates is serious:

Bigg Boss 6: Today promo viral

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ